NTV Telugu Site icon

Hyundai: మొబైల్ ఆసుపత్రిని ప్రారంభించిన హ్యుందాయ్ మోటార్స్..ఎక్కడంటే..?

Hyundai

Hyundai

హ్యుందాయ్ మోటార్ త్వరలో భారతీయ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానుంది. కంపెనీ తన ఐపీవో (Hyundai IPO) కోసం సెబీ(SEBI)కి పత్రాలను కూడా పంపింది. తాజాగా ఈ కంపెనీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ మరియు ఔరంగాబాద్‌లో మొబైల్ మెడికల్ యూనిట్‌ను ప్రారంభించింది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ కంపెనీ భారతీయ అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. ఈ స్పర్శ్ సంజీవని మొబైల్ మెడికల్ యూనిట్లను మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి, క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రి గిరీష్ మహాజన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు పాల్గొన్నారు.

READ MORE: Encounter: మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టుల హతం..

కంపెనీ కార్పొరేట్ వ్యవహారాల విభాగంలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మరియు వెర్టికల్ హెడ్ పునిత్ ఆనంద్ మాట్లాడుతూ.. సర్వతోముఖాభివృద్ధికి ఆరోగ్యకరమైన జనాభా మొదటి అవసరం అన్నారు. “ఇది హ్యుందాయ్ యొక్క గ్లోబల్ విజన్. ‘ప్రోగ్రెస్ ఫర్ హ్యుమానిటీ’కి కూడా అనుగుణంగా ఉంది. నాగ్‌పూర్‌, ఔరంగాబాద్‌ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోని మొబైల్‌ మెడికల్‌ యూనిట్ల సహాయంతో చికిత్స అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ పని కోసం హ్యుందాయ్ ప్రత్యేక మైటీ వ్యాన్‌లను మొబైల్ మెడికల్ యూనిట్‌లుగా మార్చాం. ఇందులో అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకు పరీక్షలు, ఉచిత కన్సల్టేషన్ సౌకర్యాలు కల్పిస్తాం. ” అని పేర్కొన్నారు.

READ MORE:Wagh Nakh: లండన్ నుంచి ముంబై చేరుకున్న ఛత్రపతి శివాజీ ఆయుధం ‘‘వాఘ్ నఖ్’’

మొబైల్ మెడికల్ యూనిట్‌లోని ప్రతి వ్యాన్‌లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు. ఈ వ్యాన్ గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలకు ఉచితంగా వైద్య సలహాలు, మందులు అందజేస్తుంది. అన్ని వ్యాన్‌లలో ఆధునిక వైద్య పరీక్షా సౌకర్యాలు, పరీక్ష సాధనాలతో పాటు బ్లడ్ షుగర్, మలేరియా, డెంగ్యూ మరియు రక్తపోటును పరీక్షించే సౌకర్యాలు ఉంటాయి.