డబ్బు కావాలనే ఆశ ఎవరికి ఉండదు చెప్పండి. ఎంతున్నా ఇంకా కావాలనిపిస్తుంది. అందుకే డబ్బు సంపాదన కోసం తీవ్రంగా శ్రమిస్తుంటారు. చేతిలో ఉన్న డబ్బును వివిద మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తుంటారు. కాగా ఇన్వెస్ట్ చేసేందుకు అనేక మార్గాలున్నాయి. కానీ, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను అందుకోవాలని భావిస్తుంటారు. ఇలాంటి వారి కోసం పోస్టాఫీస్ సూపర్ స్కీమ్స్ ను అమలు చేస్తున్నది. మరి పోస్టాఫీస్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసి లక్షల్లో లాభాలు అందుకోవాలంటే మతిపోయే స్కీమ్ ఉంది. అదే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్.
ఇందులో ఇన్వెస్ట్ చేస్తే వద్దన్నా లక్షల్లో లాభం అందుకోవచ్చు. ఈ పథకంలో మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. ఇందులో పెట్టుబడిపై వడ్డీ రేటు 6.7 శాతం వస్తుంది. మీరు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో ఖాతాను తెరవవచ్చు. ఇందులో పెట్టుబడిని రూ. 100 నుంచి ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీరు చేసే ఇన్వెస్ట్ మెంట్ పై ఆధారపడి ఆదాయం వస్తుంది. సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ కింద గరిష్టంగా ముగ్గురు కలిసి ఈ స్కీంలో పెట్టుబడి పెట్టొచ్చు. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకంలో మైనర్ పేరు మీద కూడా ఖాతా తెరవవచ్చు. అయితే ఇందులో తల్లిదండ్రులు తమ గుర్తింపు పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది.
కాగా ఈ పథకంలో నెలకు రూ. 10 వేలు పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ నాటికి రూ. 7 లక్షలు పొందొచ్చు. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో ప్రతి నెలా రూ. 10 వేలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి లక్ష 20 వేలు అవుతుంది. ఐదు సంవత్సరాలలో మీరు మొత్తం 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తారు. ఈ మొత్తంపై వడ్డీ రేటు 6.7 చొప్పున రూ. 1 లక్ష 13 వేల 659 వడ్డీ ఆదాయం వస్తుంది. మెచ్యూరిటీ సమయానికి మీరు పెట్టిన పెట్టుబడి దానిపై వచ్చే వడ్డీ కలుపుకుని మొత్తం ఫండ్ రూ. 7 లక్షల 13 వేల 659 చేతికి అందుతుంది.