HDFC & ICICI Bank Q4 Results: డబ్బులే డబ్బులు! ఒక్క ఏడాదే రూ.74 వేల కోట్ల లాభం.. బ్యాంకింగ్ దిగ్గజాల లాభాల పంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HDFC & ICICI Bank Q4 Results: దేశంలోని అగ్రశ్రేణి ప్రైవేట్ బ్యాంకులు 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అదిరిపోయే ఫలితాలను సాధించాయి. హెచ్‌డిఎఫ్‌సి తన పట్టును నిలబెట్టుకోగా, ఐసిఐసిఐ బ్యాంక్ ఏకంగా రూ.50 వేల కోట్ల వార్షిక లాభాల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది.
READ ALSO: May 1 Releases : పెద్ది పోస్ట్ పోన్.. మేడే కోసం క్యూ కట్టిన సినిమాలు
Also Read
- Jio Annual Plan: జియో వార్షిక ప్లాన్‌తో అదిరిపోయే ఆఫర్.. అన్లిమిటెడ్ 5జీతో పాటు AI, OTT సబ్స్క్రిప్షన్లు ఉచితం
- LPG Cylinder Price Cut: ఆగస్టు మొదటి రోజే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
- IPOకి ముందు Zeptoకి సరికొత్త షాక్.. స్విగ్గీ, జొమాటో సైలెంట్ విక్టరీ!
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్..
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్.. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.19,221 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో (రూ. 17,616 కోట్లు) పోలిస్తే ఇది 9.1 శాతం ఎక్కువ. ఈ బ్యాంకు పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం 10.9% పెరిగి రూ. 74,671 కోట్లకు చేరుకుంది. దీంతో బ్యాంకు డివిడెండ్ కోసం ఒక్కో షేరుకు రూ. 13 చొప్పున తుది డివిడెండ్‌ను బోర్డు సిఫార్సు చేసింది. దీనితో కలిపి ఏడాదికి మొత్తం డివిడెండ్ రూ.15.50కి చేరింది. ఈ బ్యాంక్ తాత్కాలిక ఛైర్మన్ కేకి మిస్త్రీ పదవీకాలాన్ని పొడిగించాలని యాజమాన్యం భావిస్తోంది. అలాగే బ్యాంకింగ్ ఉత్పత్తుల విక్రయాల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని సీఈఓ జగదీశన్ స్పష్టం చేశారు.
ఐసిఐసిఐ బ్యాంక్
రెండవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసిఐ సరికొత్త చరిత్ర సృష్టించింది. బ్యాంక్ వార్షిక నికర లాభం తొలిసారిగా రూ.50,000 కోట్ల మార్కును దాటి రూ. 50,146.6 కోట్లకు చేరింది. క్యూ4లో లాభం 8.5% పెరిగి రూ. 13,701.7 కోట్లుగా నమోదైంది. దీంతో డివిడెండ్ కోసం ఒక్కో షేరుకు రూ. 12 డివిడెండ్‌ను బ్యాంక్ ప్రకటించింది. మొండి బకాయిలు తగ్గడం బ్యాంక్ లాభాలకు ప్రధాన కారణం. ఇదే సమయంలో యస్ బ్యాంక్ కూడా అద్భుతమైన పురోగతి సాధించింది. నాలుగో త్రైమాసికంలో లాభం ఏకంగా 44.8% పెరిగి రూ.1,068 కోట్లుగా నమోదైంది. ఈ బ్యాంకు వార్షిక లాభం విషయానికి వస్తే.. ఏడాదికి మొత్తం లాభం రూ.3,476 కోట్లకు చేరింది. ఈ బ్యాంక్ కొత్త ఎండి & సీఈఓ వినయ్ తోన్సే బాధ్యతలు చేపట్టిన తర్వాత, లాభదాయకత, క్రమశిక్షణతో కూడిన విస్తరణపై ఆయన ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు ప్రకటించారు. జపాన్‌కు చెందిన SMBC పెట్టుబడులు బ్యాంక్ బలాన్ని మరింత పెంచుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మొత్తం మీద భారతీయ బ్యాంకింగ్ రంగం పటిష్టమైన స్థితిలో ఉందని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులు తమ మొండి బకాయిలను తగ్గించుకుంటూ భారీ లాభాల దిశగా దూసుకుపోతున్నాయి.
READ ALSO: Char Dham Yatra: హిమాలయాల్లో ఆధ్యాత్మిక శోభ.. తెరుచుకున్న గంగోత్రి, యమునోత్రి ద్వారాలు!
తాజావార్తలు
-
Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. ‘ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్‌పోర్టు వచ్చింది’
-
Varun Tej: జై జై బాబు.. కళ్యాణ్ బాబు అంటూ మార్మోగిన ఈవెంట్.. పవన్ కళ్యాణ్‌పై వరుణ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
Mega158: బర్త్‌డే స్పెషల్‌గా ‘మెగా158’ బీహైండ్ ది సీన్స్ వీడియో.. బాబీ కొల్లి విజన్‌పై మెగా టీమ్ ప్రశంసలు
-
Alluri Sitarama Raju International Airport: ‘ఎర్రబస్సులు కాదు.. ఇప్పుడు ఎయిర్‌బస్‌లు తిరుగుతున్నాయి’
-
Parliament protests: హుందాతనం నుంచి హంగామా వైపు.. పార్లమెంట్లో నిరసనల తీరు ఎలా మారింది?
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!