దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం క్రమంగా పెరుగుతున్నది. టూ వీలర్స్‌తో పాటు కార్లను కూడా ఇండియాలో తయారు చేస్తున్నారు. ఇప్పటికే టాటా మొదలు అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్ల వినియోగంలో కీలకమైనది బ్యాటరీ ఛార్జింగ్. ఛార్జింగ్‌కు ఎక్కువసమయం తీసుకుంటుంది. పెట్రోల్ బంకుల మాదిరిగానే దేశంలో ఎలక్ట్రిక్ రీఛార్జ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. మీడియం ఛార్జింగ్ నుంచి హైస్పీడ్ ఛార్జింగ్ ల వరకు ఏర్పాటు చేస్తున్నారు. గురుగ్రామ్ వద్ద నేషనల్ హైవే ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్, నీతి అయోగ్ సంయుక్తంగా దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ రీఛార్జ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. సెక్టార్ 52లో మొత్తం 100 ఎలక్ట్రిక్ వెహికల్ పాయింట్లతో ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఒకరోజులో 576 పెద్ద వాహనాలను ఛార్జింగ్ చేసుకొవచ్చు. దేశంలోనే ఇది అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్ అని, జైపూర్-ఢిల్లీ, యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై మరిన్ని ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు ఇది ప్రోటోటైప్ పైలట్ ప్రాజెక్టుగా ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
Read: ఉత్తర కొరియా మరో భారీ ప్రయోగం… ఉలిక్కిపడ్డ అమెరికా…