GST-TV prices: మోడీ సర్కార్ సామాన్య ప్రజలకు జీఎస్టీ సవరణలతో శుభవార్త చెప్పారు. ఈ పెస్టివల్ సీజన్‌కు ముందే సగటు ప్రజలకు అవసరయ్యే అన్ని వస్తువులపై జీఎస్టీని తగ్గించారు. ముఖ్యంగా, ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు, నిత్యావరసరాలు మరింత సరసమైన ధరలకు వినియోగదారుడికి అందుబాటులోకి రాబోతున్నాయి. ముఖ్యంగా, పండగలకు ముందు ప్రీమియం టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు కొనుగోలు చేయాలనే వారికి పండగే అని చెప్పవచ్చు. ఇంతకుముందు ప్రీయయం టీవీలతో పాటు చాలా వరకు ఎలక్ట్రిక్ ఐటమ్స్ 28 శాతం స్లాబ్‌లో ఉండేది, ఇప్పుడు 18 శాతం జీఎస్టీలోకి తీసుకువచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుంచి తగ్గిన జీఎస్టీ అమలులోకి రాబోతోంది.
Read Also: IND vs PAK: పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడేది కష్టమే?.. బీసీసీఐ రియాక్షన్ ఇదే!
ముఖ్యంగా, స్మార్ట్ ఎల్ఈడీ టీవీలు, 4K టీవీలు భారతీయ ప్రజలకు అందుబాటులోకి రావబోతున్నాయి. గతంలో, 32 అంగుళాల కంటే ఎక్కువ సైజ్ ఉండే పెద్ద టీవీలపై 28 శాతం పన్ను ఉండేది. ఈ రేటు కారణంగా మధ్యతరగతి ప్రజలు ప్రీమియం టీవీలకు దూరయ్యారు. అయితే, ఇప్పుడు కొత్త జీఎస్టీ స్లాబ్ కారణంగా పెద్ద టీవీలు ప్రజలకు అందుబాటు ధరలోకి వస్తాయి. వీటిలో పాటు ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్ల ధరలు కూడా అదే స్థాయిలో తగ్గుతాయి.
ఉదాహరణకు గతంలో 28 శాతం జీఎస్టీ కారణంగా రూ. 22,000 ధర ఉన్న 40- అంగుళాల స్మార్ట్ టీవీపై రూ. 6,160 పన్ను ఉండేది, దీంతో మొత్తం టీవీ ధర రూ. 28,160కు చేరుంది. ఇప్పుడు 18 శాతానికి తగ్గించడం వల్ల ఇప్పుడు జీఎస్టీ రూ. 3960కి పడిపోతుంది. దీంతో టీవీ తుది ధర రూ. 25,960కి తగ్గుతుంది. దీని వల్ల వినియోగదారుడికి రూ. 2200 ఆదా అవుతుంది. ఇదే విధమైన లెక్కింపు ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లకు కూడా వర్తిస్తుంది.