సర్కార్ చేతిలోకి వొడాఫోన్-ఐడియా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశంలో మూడో అతి పెద్ద టెలికం సంస్థగా పేరు పొందిన వొడాఫోన్ – ఐడియా లిమిటెడ్‌లో మెజార్టీ వాటాలు ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయాయి.. దీనిపై ఆ సంస్థ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.. అయితే, ఈ పరిణామాల తర్వాత స్టాక్ మార్కెట్‌లో వొడాఫోన్ ఐడియా షేర్లు భారీగా పడిపోయాయి.. అయితే, కంపెనీ బకాయిలను ఈక్విటీగా మార్చిన తర్వాత వొడాఫోన్ ఐడియాలో 35.8 శాతం వాటా సర్కార్ చేతిలోకి వెళ్లింది.. టెలికం మార్కెట్‌లో పోటీ కారణంగా.. కస్టమర్లను భారీగా కోల్పోతున్న తరుణం, పెద్దగా లాభాలు లేని పరిస్థితులు ఉండడంతో ఈ చర్య తప్పడం లేదంటూ ఆ కంపెనీ సమర్థించుకుంది.. సోమవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ వాటాకు అంగీకారం లభించింది.. ఇప్పటి వరకు యూకేకు చెందిన వొడాఫోన్ గ్రూప్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ 28.5 శాతం వాటాలు కలిగి ఉండగా, కుమార్ మంగళం బిర్లా ఆధ్వర్యంలోని ఆదిత్యా బిర్లా గ్రూప్‌కు 17.8 శాతం వాటా ఉంది… తాజా నిర్ణయంతో భారత ప్రభుత్వం వాటా 36 శాతానికి పెరిగింది..
Read Also: జగనన్న స్మార్ట్ టౌన్షిప్వెబ్సైట్ ప్రారంభం.. 3 కేటగిరీల్లో స్థలాల పంపిణీ
Also Read
- LIC Yuva Term Plan: సామాన్యులకు సూపర్ స్కీమ్.. రోజుకు రూ.24తో రూ.50 లక్షల ఇన్సూరెన్స్! ఓ లుక్ వేయండి..
- Reliance Bonds: డబ్బు దాచేవారికి రిలయన్స్ బంపర్ ఆఫర్.. 7.47% వడ్డీపై ఈ విషయాలు తెలుసుకోండి!
- Gold and Silver Rates Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతంటే..?
- BSNL దూకుడు.. జియో, ఎయిర్‌టెల్‌కు షాక్..
వాయిదా వేసిన స్పెక్ట్రమ్‌పై వడ్డీని మరియు సర్దుబాటు చేసిన స్థూల రాబడి బకాయిలను ఈక్విటీగా మార్చాలని నిర్ణయించుకున్నందున వొడాఫోన్ ఐడియాలో అతిపెద్ద వాటాదారుగా అవతరించింది ప్రభుత్వం.. గత అక్టోబర్‌లో కేంద్రం తన టెలికాం సంస్కరణల ప్యాకేజీలో టెలికాం కంపెనీలకు స్పెక్ట్రమ్ మరియు AGR బకాయిలపై నాలుగు సంవత్సరాల మారటోరియం మంజూరు చేసింది. వాయిదా వేసిన అప్పులపై వడ్డీని ఈక్విటీగా మార్చుకునే అవకాశం కూడా కంపెనీలకు ఇవ్వబడింది. అయితే, ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా మారవచ్చు, కంపెనీని నడపడంలో పాలుపంచుకోకపోవచ్చు అని గతంలోనే వొడాఫోన్ ఐడియా సీఈవో రవీందర్ టక్కర్ తెలిపారు. కంపెనీని ప్రభుత్వ రంగ సంస్థగా మారుస్తుందని పేర్కొనడం సరికాదన్న ఆయన.. మేం కంపెనీని సమర్ధవంతంగా మరియు పోటీతత్వంతో నడపాలని ప్రభుత్వం కోరుకుంటోంది.. ప్రభుత్వంతో నేను జరిపిన సంభాషణలన్నింటిలోనూ, భారతదేశంలో టెలికాం కంపెనీలను కొనుగోలు చేయడం మరియు నిర్వహించడం పట్ల తమకు ఆసక్తి లేదని స్పష్టంగా ప్రభుత్వం చెప్పిందని టక్కర్ తెలిపారు.
- Tags
తాజావార్తలు
-
PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
-
Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్‌కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
-
Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!
-
Speaker Gaddam Prasad: స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైర్.. బీఆర్ఎస్ తీరుపై అసంతృప్తి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!