జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్​వెబ్‌సైట్‌ ప్రారంభం.. 3 కేటగిరీల్లో స్థలాల పంపిణీ

ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్న సంకల్పంతో ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలు పేదవాళ్లకు ఇప్పటికే పంపిణీ చేశామని గుర్తుచేసుకున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్.. క్యాంపు కార్యాలయంలో ఎంఐజీ వెబ్ సైట్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొదటి దశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి.. మధ్య తరగతి కుటుంబాలకు కూడా సొంతింటి కలను సాకారం చేయడానికి మార్కెట్‌ కంటే తక్కువకే ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.. ప్రభుత్వమే అభివృద్ధి చేసి, ప్లాట్లను ఇస్తుంది.. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేని విధంగా ప్లాట్లు ఉంటాయని.. సంక్రాంతి పండుగ వేళ దీనికి శ్రీకారం చూడుతున్నామని.. 3 కేటగిరీల్లో స్థలాల పంపిణీ ఉంటుందని తెలిపారు.

Read Also: కరోనా ఆంక్షలు మరింత కఠినం.. అన్ని ఆఫీసులు మూత..

మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా నవులూరులోనూ, వైయస్సార్‌జిల్లా రాయచోటిలోనూ, ఒంగోలు జిల్లా కందుకూరులోనూ, ప.గో. జిల్లా ఏలూరులోనూ లే అవుట్లు వేస్తున్నట్టు తెలిపారు సీఎం వైఎస్‌ జగన్.. ప్రతి నియోజకవర్గంలో హెడ్‌ క్వార్టర్స్‌లో దీన్ని ఏర్పాటు చేస్తాం.. ప్రత్యేకమైన వెబ్‌సెట్‌ను ప్రారంభిస్తున్నాం.. 18 లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉన్న వారు జగనన్న టౌన్స్‌లో ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని తెలిపారు. ఉన్న ప్రాంతంలోనే దరఖాస్తు చేసుకోవచ్చు, ఏడాది కాలంలో నాలుగు వాయిదాల్లో చెల్లింపులు చేయవచ్చు, చెల్లింపులు పూర్తికాగానే డెవలప్‌ చేసిన ప్లాట్‌ను చేతికి అందిస్తామని.. ప్లాట్ల నిర్ణీత విలువో మొదట 10శాతం చెల్లించాలి.. అగ్రిమెంట్‌ చేసుకున్నతర్వాత 30 శాతం, ఆరు నెలల్లోపు 30శాతం, మిగతాది 12 నెలల్లోగా లేదా రిజిస్ట్రేషన్‌ తేదీలోగా చెల్లించాలని వెల్లడించారు. ఇక, మొన్న పీఆర్సీ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు మాట ఇచ్చాం.. 10 శాతం ప్లాట్లను రిజర్వ్‌చేస్తూ, 20 శాతం రిబేటుతో ఇస్తామన్నారు సీఎం జగన్.. ఏడాదిలో సమగ్ర లే అవుట్‌ అభివృద్ధి చేస్తామని.. అన్నిరకాల నిబంధనలను పాటిస్తామని.. మోడల్‌ లే అవుట్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేవారు. దరఖాస్తు చేసుకున్న విషయానికొస్తే పూర్తి పారదర్శకతతో కేటాయిస్తామన్న ఏపీ సీఎం… కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీలతో సంబంధాలు లేకుండా అత్యంత పారదర్శక పద్ధతిలో చేస్తాం.. 150 గజాలు, 200 గజాలు, 240 గజాలు స్థలాలను ఎంచుకునే వెసులుబాటు ఉంటుందని.. లే అవుట్‌ విస్తీర్ణంలో 50 శాతం స్థలం కాలనీలో ఉమ్మడి అవసరాలకు వినియోగిస్తామని.. పార్కులు, ప్లే గ్రౌండ్స్, స్కూళ్లు, బ్యాంకులు తదితరాల కోసం కేటాయిస్తామని.. విశాలమైన 60 అడుగుల బీటీ రోడ్లు, కలర్‌ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లు, ఎవెన్యూ ప్లాంటేషన్స్‌.. ఇలాంటి పద్ధతుల్లో చేస్తామని వెల్లడించారు. ఎవ్వరూ వేలెత్తి చూపించలేని పరిస్థితిలో అభివృద్ధిచేస్తాం.. లే అవుట్‌ డెవలప్‌మెంట్‌కోసం కార్పస్‌ ఫండ్‌ కూడా ఏర్పాటు చేస్తాం.. పట్టణాభివృద్ధి సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తాం.. మిగిలిన వారు కూడా రేట్లు తగ్గించే పరిస్థితి వస్తుందన్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

Related Articles

Latest Articles