Google Layoff: “నా గుండె పగిలిపోయింది”.. బిడ్డ పుట్టిన కొన్ని రోజులకే గూగుల్ ఉద్యోగి లేఆఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Layoff: ఆర్థిక మందగమనం, ఆర్థికమంద్యం భయాలు టెక్ కంపెనీల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఆదాయాలు తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు. గతేడాది నవంబర్ నుంచి టెక్ సంస్థల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలైన గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ ఇలా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు స్వస్తి పలికాయి. అయితే ఈ లేఫ్స్ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఇటీవల ప్రసూతి సెలవుల్లో ఉన్న ఉద్యోగిని గూగుల్ కంపెనీ కొలువు నుంచి తీసేసింది. కంపెనీలో 12 ఏళ్లుగా పనిచేస్తున్న సదరు ఉద్యోగి ఉద్యోగం పోయే సమయంలో ఓ బిడ్డకు జన్మనిచ్చి 10 వారాలైంది. ఉద్యోగం పోవడంపై సదరు మహిళ తీవ్ర భావోద్వేగానికి గురైంది. తనను ఉద్యోగం నుంచి తీసేసిన సమయంలో 10 వారాల పాపతో ఉన్నానని లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసింది. ఈ వార్త తెలిసిన వెంటనే తన గుండె పగిలిందని ఆమె పోస్టులో తన బాధను వ్యక్త పరిచింది. ఇన్నాళ్లు గూగుల్ సంస్థలో తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Also Read
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
- UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
Read Also: Disney+ Hotstar: పాస్వర్డ్ షేరింగ్‌కి హాట్‌స్టార్ గుడ్ బై.. షేర్ చేస్తే కఠిన చర్యలు..
కొత్త ఉద్యోగంలో గుర్తించడం, ఇంటర్వ్యూలకు హాజరవ్వడం కష్టంగా మారిందని మహిళా ఉద్యోగి రాసుకొచ్చారు. పాజిటివ్ మైండ్ సెట్ కొనసాగిస్తూ తదుపరి ఏం జరుగుతోందో చూడటానికి తాను ఉత్సాహంగా ఉన్నట్లు రాసింది. ఏదైనా కంపెనీలో స్టాఫింగ్ మేనేజర్, ప్రోగ్రామ్ మేనేజర్ రోల్స్ ఏమైనా ఉంటే తనను గుర్తుపెట్టుకోవాలని కోరింది.
ఈ నెల ప్రారంభంలో గూగుల్ తన రిక్రూటింగ్ టీమ్ నుంచి వందలాది ఉద్యోగులను తొలగించింది. దీనికి ముందు గతేడాది నుంచి గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 12000 మంది ఉద్యోగులను ప్రపంచవ్యాప్తంగా తొలగించింది. గూగుల్ మాత్రమే కాకుండా ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా గతేడాది నవంబర్ లో 11,000 మందిని, అంటే తన కంపెనీ వర్క్ ఫోర్సులో 13 శాతాన్ని తొలగిస్తున్నట్లు తెలిపింది. అమెజాన్ 18,000 మందిని, మైక్రోసాఫ్ట్ 10,000 మందిని, ట్విట్టర్ తన ఉద్యోగుల్లో 50 శాతం మందిని తొలగించాయి.
తాజావార్తలు
-
Tollywood: ఫేక్ హౌస్‌ఫుల్స్… డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త “మైండ్ గేమ్”!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
-
Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్‌లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!