Gold Price Drop: బంగారం కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. పాతాళానికి పడిపోయిన రేట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Price Drop: సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారిన ట్రంప్.. తాజా ప్రకటనతో ప్రపంచ మార్కెట్లలో పెను సంచలనం నమోదైంది. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు ద్రవ్యోల్బణంపై గ్లోబల్ ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేకెత్తించడంతో, బంగారం, వెండి అమ్మకాలకు ఒక్కసారిగా భారీ ఒత్తిడి ఎదురైంది. దీని ప్రభావం భారతీయ మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపించింది. ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే భారత స్టాక్ మార్కెట్లు తొలుత కుప్పకూలినప్పటికీ, రోజు ముగిసే సమయానికి కోలుకోవడం విశేషం. సెన్సెక్స్ 185 పాయింట్ల లాభంతో ముగిసి ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చింది. అయితే, స్టాక్ మార్కెట్ కోలుకున్నా బులియన్ మార్కెట్ మాత్రం కోలుకోలేకపోయింది. వెండి ధరలు ఊహించని రీతిలో పతనమయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే వెండి ధర 8 శాతం క్షీణించి కిలో రూ. 2,24,500 వద్దకు చేరుకుంది. ఒకే రోజులో కిలో వెండిపై సుమారు రూ.19,000 మేర భారీ తగ్గుదల నమోదైంది.
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
మరోవైపు పసిడి ధరలు కూడా అదే బాటలో పయనించాయి. గురువారం ట్రేడింగ్ సమయంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధర 4 శాతం మేర పడిపోయి, 10 గ్రాముల బంగారం రూ.1,47,100కి చేరింది. గత రెండు నెలలుగా బంగారం, వెండి ధరలలో తీవ్రమైన హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి 29న కిలో వెండి ఏకంగా రూ.4,25,000కు, 10 గ్రాముల బంగారం ధర రూ.1,93,096కు పెరిగి రికార్డు సృష్టించాయి. ప్రస్తుత ధరలతో పోలిస్తే వెండి దాని గరిష్ఠ స్థాయి నుంచి సుమారు రూ.2 లక్షలు, బంగారం సుమారు రూ.45 వేలు తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి.
పెట్టుబడిదారులకు గత ఏడాది కాలంలో బంగారం 70 శాతానికి పైగా రాబడిని అందించగా, వెండి ధర రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. అందుకే ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువత తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో బంగారాన్ని చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. గత నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచాలని తీసుకున్న నిర్ణయం కూడా ఈ లోహాల ధరలపై ఒత్తిడి పెంచింది. అయితే, పారిశ్రామిక రంగంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్లు, గ్రీన్ ఎనర్జీ రంగాలలో వెండి వినియోగం పెరుగుతుండటంతో, పెట్టుబడిదారులు వెండి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
READ ALSO: Liquor Sales: ఏరులై పారుతున్న మద్యం.. 70% పెరిగిన బీర్ల అమ్మకాలు.. కానీ ఆదాయం మాత్రం!
తాజావార్తలు
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!