పసిడి ప్రియులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా హెచ్చు తగ్గులుగా ఉన్న బంగారం ధరలు గత వారం బాగానే తగ్గుముఖం పట్టాయి. ట్రంప్ సుంకాలు కారణంగా బంగారం ధరలు అమాంతంగా పెరిగిపోతాయని గోల్డ్ లవర్స్ ఆందోళన చెందారు. కానీ అందుకు భిన్నంగా ధరలు తగ్గుతుండడంతో బంగారం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వారం ప్రారంభంలో ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. ప్రస్తుత ధరలు యథావిధిగానే ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Trump-Zelenskyy: జెలెన్‌స్కీతో భేటీకి ముందు ట్రంప్ ఝలక్.. మళ్లీ వాగ్యుద్ధం తప్పదా?
24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01, 180 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 92,750 దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,890 దగ్గర ట్రేడ్ అవుతోంది. వెండి ధర మాత్రం షాకిచ్చింది. కేజీ వెండిపై రూ.800 పెరిగింది. ప్రస్తుతం రూ.1,17, 000 దగ్గర ట్రేడ్ అవుతుంది. చెన్నైలో మాత్రం కేజీ సిల్వర్ ధర రూ.1, 27, 00 ఉండగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో మాత్రం రూ.1,17,000 దగ్గర ట్రేడ్ అవుతుంది.
ఇది కూడా చదవండి: Pneumonia in Children: పేరెంట్స్ అలర్ట్.. వర్షాకాలంలో పిల్లలకు న్యుమోనియా ఎఫెక్ట్.. జాగ్రత్త సుమీ!
