Pneumonia in Children: పేరెంట్స్ అలర్ట్.. వర్షాకాలంలో పిల్లలకు న్యుమోనియా ఎఫెక్ట్.. జాగ్రత్త సుమీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pneumonia in Children: వర్షాకాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, జ్వరాలు, శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా చిన్నారుల్లో న్యుమోనియా కేసులు ఈ కాలంలో అధికంగా కనిపిస్తాయి. న్యుమోనియా ఒక తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు కలగవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
వర్షాకాలంలో న్యుమోనియా ఎక్కువగా ఎందుకు వస్తుంది?
వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీని వలన బాక్టీరియా, వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. అలాగే చల్లని వాతావరణం కారణంగా పిల్లల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఇంకా తడిసి వర్షంలో ఆడుకోవడం, తడి బట్టలతో ఉండటం వల్ల శరీరం చల్లబడుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు త్వరగా పట్టేస్తాయి. అలాగే ఇంట్లో గదులు మూసివేసి ఉండటం, గాలి సరిగా ఆడకపోవడం వల్ల వైరస్‌లు ఒకరినుంచి మరొకరికి సులభంగా పాకుతాయి. ఎక్కువ రోజులు తగ్గని జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, లేదా వేగంగా శ్వాస తీసుకోవడం ఇంకా దగ్గు, కఫం, ఆహారం తినకపోవడం, బలహీనత, పెదవులు, గోర్లు నీలిరంగులోకి మారడం (తీవ్ర స్థితి) వంటివి న్యుమోనియా లక్షణాలు పిల్లల్లో కనిపిస్తాయి.
Also Read
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
MEGA 157 : మెగాస్టార్ సినిమా టైటిల్ చెప్పేసిన అనిల్ రావిపూడి.. అదిరిందిగా
నివారణ ఎలా?
పిల్లలను వర్షంలో తడవకుండా చూసుకోవాలి. తడిసిన వెంటనే పొడి బట్టలు వేసి వేడి పాలు లేదా సూప్ ఇవ్వాలి. ఇంకా ఇమ్యూనిటీ పెంచే ఆహారం బాగా ఇవ్వాలి. ముఖ్యంగా పాలు, గుడ్లు, పండ్లు, కూరగాయలు, పప్పులు ఇవ్వడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఇంకా కుదిరితే ముందు జాగ్రత్తగా వాక్సినేషన్ చాలా ముఖ్యం. న్యుమోనియా వ్యాక్సిన్, ఫ్లూ షాట్లు డాక్టర్ సలహా మేరకు వేయించాలి. అలాగే ఇంట్లో గాలి సరిగా ఆడేలా చూడాలి. పిల్లలు ఉండే గదుల్లో తేమ ఎక్కువ కాకుండా జాగ్రత్త పడాలి.
New York India Day Parade : న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌లో మెరిసిన టాలీవుడ్ స్టార్ జంట
ఇంకా దగ్గు, జలుబు ఉన్నవారి దగ్గర పిల్లలను దూరంగా ఉంచండి. పిల్లల్లో శ్వాస ఇబ్బందులు గమనించిన వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. వర్షాకాలం మంచిదే.. కానీ, చిన్నారుల ఆరోగ్యానికి సవాలుగా మారుతుంది. కాబట్టి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ, ముందు జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలను న్యుమోనియా వంటి ప్రమాదకర ఇన్ఫెక్షన్ల నుండి రక్షించుకోవచ్చు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?