పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఈరోజు బంగారం ధరలకు బ్రేక్ పడింది.. నిన్న మార్కెట్ లో నమోదు అయిన ధరలతో పోలిస్తే నేడు ధరలు దిగి వచ్చాయి.. బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి.. దాంతో ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది.. వెండి ధర మాత్రం జిగేల్ మంటుంది.. స్వల్పంగా పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. ఈరోజు బంగారం ధర 10 గ్రాములకు రూ.300 తగ్గి రూ.54,050కి చేరుకుంది. అలాగే వెండి కిలో కు రూ.400 పెరిగి రూ.71,900కి చేరుకుంది..
మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన ఈ ధరలు ఇప్పుడు నెలకు దిగిరావడం పై పసిడి ప్రియులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. నిన్న, ఈరోజు రేట్లు ఊరట కలిగిస్తున్నాయి. దీంతో మార్కెట్ లో కొనుగోళ్లు కూడా భారీగా పెరిగాయి.. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర 10 గ్రాములకు రూ.300 తగ్గి రూ.54,050 వద్ద కొనసాగుతుంది.. వెండి నిన్నటితో పోలిస్తే కాస్త పెరిగింది..వెండి కిలోకు రూ.400 పెరిగి రూ.71,900కి చేరుకుంది..అదే విధంగా ఢిల్లీ లో 24 క్యారెట్ల బంగారం ధర.. 10 గ్రాములకు రూ.300 తగ్గి రూ.59,110కి చేరుకుంది. కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,200లుగా ఉంది.
ముంబై లో బంగారం ధరలు..24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.58,960లకు చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర 54,050లకు చేరుకుంది. చెన్నైలో కూడా దాదాపు అదే ధరలు కొనసాగుతున్నాయి.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,410లు, కాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,460లకు చేరుకుంది.ఇక వెండి ధరలు భారీ పెరిగాయి.. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు హైదరాబాద్‌లో రూ.71,900లుగా నమోదు అయ్యింది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.రూ.71,900 వద్ద కొనసాగుతోంది. ప్రముఖ నగరాల్లో ఇదే ధరతో నమోదు అవుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..