ఈరోజు బంగారం కొనాలేనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. గత కొంతకాలంగా బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. ఇక ఈరోజు కూడా ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. ఇటీవల కాలంలో బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతోనే బంగారం ధరలో భారీ మార్పులు వస్తున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.. ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బంగారంపై రూ.660 ధర తగ్గగా.. వెండిపై రూ.2000 మేర ధర తగ్గింది. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,380 గా ఉంది. కాగా.. వెండి కిలో ధర రూ.71,000 లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
*.ఢిల్లీలో పది గ్రాముల పసిడి ధర రూ.52,750 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.57,530 గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,600, 24 క్యారెట్ల ధర రూ.57,380ఉంది..
*. కోల్‌కతాలో 22 క్యారెట్లు రూ.56,600, 24 క్యారెట్ల ధర రూ.57,380గా ఉంది.
*. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.52,900, 24 క్యారెట్ల ధర రూ.57,710గా ఉంది.
*. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.52,600, 24 క్యారెట్ల ధర రూ.57,380 వద్ద కొనసాగుతుంది..
*. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.52,600 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.57,380 గా ఉంది..
ఇక బంగారం తగ్గితే, వెండి కూడా అదే దారిలో నడిచింది.. వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..ఢిల్లీలో వెండి కిలో ధర రూ.71,000 గా ఉంది. ముంబైలో వెండి ధర రూ.71,000, చెన్నైలో రూ.73,500, బెంగళూరులో రూ.69,000, కేరళలో రూ.73,500, కోల్‌కతాలో రూ.71,000 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.73,500 ఉంది.. మరి రేపు మార్కెట్ బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..