గత రెండు, మూడు రోజులుగా బంగారం ధరలు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.. నేడు మార్కెట్ లో బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి.. ఈరోజు ధరలు ఉపశననం కలిగిస్తున్నాయి.. 10 గ్రాముల బంగారంపై రూ. 180 తగ్గింది. బంగారం ధర ఒకే రోజులో ఇంత మొత్తం తగ్గుదల కనిపించడం విశేషం. ఇటీవలి కాలంలో బంగారం ధర ఈ స్థాయిలో తగ్గుముఖం పట్టడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది.. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
* ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,050కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,050గా ఉంది.
* ఢిల్లీలో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 55,200కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,200గా ఉంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,050 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర..60,050 వద్ద కొనసాగుతోంది..
* ఇక చెన్నైలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,300కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,330 వద్ద నమోదు అవుతుంది..
* తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది..
ఇక వెండి విషయానికొస్తే..శుక్రవారం వెండి ధరలో మార్పు కనిపించలేదు..చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,000కాగా ముంబయిలో కిలో వెండి ధర రూ. 74,500గా ఉంది. ఇక ఢిల్లీలో రూ. 74,500, కోల్‌కతాలో రూ. 74,500, బెంగళూరులో రూ. 74,500 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ లో 78,000 గా కొనసాగుతుంది.. ఇక రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..