Site icon NTV Telugu

Gold-Silver Rates: గోల్డ్ లవర్స్‌కు పండగే.. పండగ.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు

Gold (1)

Gold (1)

హమ్మయ్య.. వెండి, బంగారం ధరలు దిగొస్తున్నాయి. పెళ్లిళ్లు.. శుభకార్యాల వేళ బంగారం కొనేది ఎలా అంటూ నిష్టూరపడ్డ వాళ్లకు మంచిరోజులొస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా ధరలను చూసి సామాన్యులు బెంబేలెత్తిపోయారు. అయితే తాజాగా ధరలు దిగొస్తున్నాయి. ఇప్పటికే వెండి ధర బాగా డౌన్ కాగా.. ఇప్పుడు ఆ కోవలోకి బంగారం కూడా వచ్చి చేరింది. గోల్డ్ రేట్ కూడా డౌన్ అవుతోంది. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.1,530 తగ్గగా.. కిలో వెండిపై రూ.8,000 తగ్గింది.

ఇది కూడా చదవండి: Trump: ‘‘దాచడానికి ఏముంది?’’ ఎప్‌స్టీన్‌తో ఎలాంటి సంబంధం లేదన్న ట్రంప్

ఈరోజు తులం గోల్డ్‌పై రూ.1,530 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,54,910 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,400 తగ్గడంతో రూ.1,42,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,150 తగ్గడంతో రూ.1,16,180 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Haryana: 5 నెలల క్రితమే బ్యాంక్ ఉద్యోగినితో పెళ్లి.. వాలెంటైన్ డే రోజున భర్త ఏం చేశాడంటే..!

హమ్మయ్య.. ఈరోజు సిల్వర్ ధర కూడా భారీ ఉపశమనం ఇచ్చింది. కిలో వెండిపై ఏకంగా రూ.8,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2, 60, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,65,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,60, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.

Exit mobile version