Site icon NTV Telugu

Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు

Gold

Gold

బంగారం, వెండి ధరలు ఈ మధ్య రోజుకో లాగా ఉంటున్నాయి. ఒకసారి ఎక్కువగా పెరిగిపోతుంటే.. ఇంకో రోజు తక్కువగా తగ్గుతున్నాయి. ఇలా ధరలు కొనుగోలుదారులతో దోబూచులాడుతున్నాయి. నిన్న భారీగా పెరిగిన ధరలు.. ఈరోజు దిగొచ్చాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ. 5,020 తగ్గగా.. కిలో వెండిపై రూ.20,000 తగ్గింది.

తులం గోల్డ్‌పై రూ.5,020 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,54,420 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.4,600 తగ్గడంతో రూ.1,41,550 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.3,760 తగ్గడంతో రూ.1,15,820 దగ్గర ట్రేడ్ అవుతోంది.

వెండి ధర కూడా ఉపశమనం కలిగించింది. కిలో వెండిపై ఏకంగా రూ.20,000 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3,00, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కూడా కిలో వెండి ధర రూ.3,00, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.

 

Exit mobile version