బంగారం, వెండి ధరల దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. గత వారం విశ్వరూపం సృష్టించిన ధరలు.. ఈ వారం కూడా అదే రేంజ్‌లో దూసుకెళ్తున్నాయి. రాకెట్‌లా పరుగులు పెడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ల మొదలయ్యాయి. బంగారం కొనాలా? వద్దా? అన్న సందిగ్ధంలో పడుతున్నారు. ఇక సామాన్యుడి పరిస్థితి అయితే మరీ దారుణం. ఈ పరిస్థితుల్లో ఏం కొనగలమంటూ హడలెత్తిపోతున్నారు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.2,450 పెరగగా.. కిలో వెండిపై రూ.5,000 పెరిగింది.
తులం గోల్డ్‌పై రూ.2,450 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,62,710 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.2,250 పెరగడంతో రూ.1,49,150 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,840 పెరగడంతో రూ.1,22,030 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఈరోజు సిల్వర్ ఉపశమనం కలిగింది. కిలో వెండిపై రూ.5,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3,40, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.3,75,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.3,40, 000 దగ్గర అమ్ముడవుతోంది. త్వరలోనే 4 లక్షల మార్కు దాటేయనుంది.
