వామ్మో.. బంగారం, వెండి ధరలకు ఏమైంది? రెండూ కూడా పోటాపోటీగా పెరిగిపోతున్నాయి. నువ్వా-నేనా? అన్నట్టుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. ఓ వైపు సిల్వర్.. ఇంకోవైపు బంగారం.. రెండూ కూడా సరికొత్త రికార్డ్‌లు నమోదు చేశాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.5,020 పెరగడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,800 దగ్గర ట్రేడ్ అవుతూ సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. ఇక వెండి కూడా తగ్గేదేలే అన్నట్టుగా రాకెట్‌లా పైకి పైకి పోతుంది. ఈరోజు కిలో వెండిపై రూ.5,000 పెరిగింది. దీంతో సిల్వర్ కూడా రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తోంది.
తులం గోల్డ్‌పై రూ.5,020 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,800 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.4,600 పెరగడంతో రూ.1,41,900 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.3,770 పెరిగి రూ.1,16,110 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇక ఈరోజు కిలో వెండిపై రూ.5,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3,25, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.3,40,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.3,25, 000 దగ్గర అమ్ముడవుతోంది. త్వరలోనే మూడున్నర లక్షల మార్కు దాటేయనుంది.
