గతేడాది మెరుపులు, వెలుగులు సృష్టించిన బంగారం, వెండి ధరలు.. ఈ ఏడాది కూడా విశ్వరూపం సృష్టించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత సంవత్సరం అంతర్జాతీయంగా పలు దేశాల్లో యుద్ధాలు కారణంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో ధరలు ఆకాశన్నంటాయి. ప్రస్తుతం కొన్ని దేశాలు శాంతించాయి. కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచే మరికొన్ని దేశాల్లో ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి. రెండు శక్తివంతమైన గల్ఫ్ దేశాలైన సౌదీ-యూఏఈ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంకోవైపు అమెరికా-వెనిజులా, రష్యా-ఉక్రెయిన్, ఇరాన్‌లో పరిస్థితులు ఏ మాత్రం బాగోలేదు. దీంతో ఈ ఏడాది కూడా ధరలు సునామీ సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈరోజు సిల్వర్ ధర మెరుపులు సృష్టించింది. ఏకంగా రూ.6,000 పెరిగింది. దీంతో ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,47, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,65,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,47, 000 దగ్గర అమ్ముడవుతోంది.
ఇక ఈరోజు తులం గోల్డ్‌పై రూ.1,580 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,580 పెరగగా.. రూ.1,37,400 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,450 పెరగగా రూ.1,25,950 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,180 పెరగగా రూ.1,03,050 దగ్గర ట్రేడ్ అవుతోంది.
