బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. గత వారం దిగొచ్చిన ధరలు.. ఈ వారం కూడా తగ్గుతాయని గోల్డ్ లవర్స్ భావించారు. కానీ అందుకు భిన్నంగా పెరిగిపోతున్నాయి. నిన్న భారీగా పెరిగిన ధరలు.. ఈరోజు కూడా మళ్లీ పెరిగిపోయాయి. తులం గోల్డ్‌పై రూ.870 పెరగగా.. కిలో వెండిపై రూ.2,000 పెరిగింది.
ఇది కూడా చదవండి: H-1B Visa: చెన్నైలో హెచ్-1బీ వీసా స్కామ్.. బయటపెట్టిన అమెరికా దౌత్యవేత్త
బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.870 పెరగగా రూ.1,27,910 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 800 పెరగగా రూ.1,17,250 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.650 పెరగగా రూ.95,930 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Trump-Kash Patel: ఎఫ్‌బీఐ చీఫ్‌పై ట్రంప్ అసంతృప్తి.. కాష్ పటేల్‌ను తొలగిస్తున్నట్లు వార్తలు!
ఇక వెండి ధర కూడా షాకిచ్చింది. కిలో వెండిపై రూ.2,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,69, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1,76,000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.1,69, 000 దగ్గర అమ్ముడవుతోంది.
