Site icon NTV Telugu

Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!

Gold

Gold

బంగారం ప్రియులకు శుభవార్త. గత కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులకు గురవుతున్న పసిడి ధరలు సోమవారం దిగొచ్చాయి. గత వారం భారీగా తగ్గిన ధరలు.. ఈవారం ప్రారంభంలో కూడా స్వల్పంగా తగ్గింది. దీంతో గోల్డ్ లవర్స్ కొనుగోలు చేసేందుకు మక్కువ చూపిస్తున్నారు. ఈరోజు తులం గోల్డ్‌ ధరపై రూ.110 తగ్గగా.. కిలో సిల్వర్ ధరపై రూ.2,000 తగ్గింది.

ఇది కూడా చదవండి: Sheikh Hasina: నేడు షేక్ హసీనాపై కీలక తీర్పు.. బంగ్లాదేశ్‌లో హైఅలర్ట్

24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.110 తగ్గి రూ.1,24,970 దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 100 తగ్గి రూ.1,14,550 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.80 తగ్గి రూ.93,730 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: DK Shivakumar: డీకే.శివకుమార్ రాజీనామా అంటూ పుకార్లు! కర్ణాటకలో ఏం జరుగుతోంది!

ఇక వెండి ధరలు కూడా భారీ ఊరటనిచ్చాయి. కిలో వెండిపై రూ.2,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,67, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1, 73,000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.రూ.1,67, 000 దగ్గర అమ్ముడవుతోంది.

ఇది కూడా చదవండి: Congo Video: కాంగోలో కూలిన మైనింగ్ గని వంతెన.. 32 మంది మృతి

Exit mobile version