బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. రెండు రోజులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిపోయాయి. కార్తీక మాసంలోనైనా క్రమంగా తగ్గొచ్చని అనుకుంటున్న తరుణంలో మళ్లీ మగువులకు షాకిచ్చింది. గురువారం తులం గోల్డ్ ధరపై రూ. 430 పెరిగింది. ఇక కిలో వెండి ధరపై రూ. 1,000 పెరిగింది
ఇది కూడా చదవండి: Bihar Elections: కొనసాగుతున్న బీహార్ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు వీళ్లే..!
గురువారం బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.430 పెరిగి.. రూ.1,21,910 దగ్గర అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.400 పెరిగి.. రూ.1, 11, 750 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 పెరిగి.. రూ.91, 430 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన తేజస్వి యాదవ్.. 14న కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని వ్యాఖ్య
ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1,000 పెరిగి.. రూ.1,51,500 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,64,000గా కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో మాత్రం రూ.1, 51, 500 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: PM Modi: ఈరోజు బీహార్‌లో ప్రజాస్వామ్య పండుగ.. పెద్ద ఎత్తున ఓట్లు వేయాలని మోడీ పిలుపు
