Site icon NTV Telugu

Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!

Gold

Gold

కార్తిక పౌర్ణమి రోజున పసిడి ప్రియులకు శుభవార్త. పండుగ పూట ధరలు భారీగా దిగొచ్చాయి. గత కొద్దిరోజులుగా హెచ్చు తగ్గులుగా ఉంటున్న ధరలు.. ఈ వారంలో మాత్రం కాస్త ఉపశమనం కలిగించాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈరోజు మాత్రం భారీగా తగ్గాయి. తులం గోల్డ్‌పై రూ.980 తగ్గగా.. కిలో వెండిపై మాత్రం రూ.500 తగ్గింది.

ఇది కూడా చదవండి: Trump: ఆ కారణాలతోనే ఓడిపోయాం.. రిపబ్లికన్ల ఓటమిపై ట్రంప్ విచిత్ర విశ్లేషణ

బుధవారం బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.980 తగ్గి.. రూ.1,21,480 దగ్గర అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.900 తగ్గి.. రూ.1, 11, 350 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.730 తగ్గి.. రూ.91, 110 దగ్గర అమ్ముడవుతోంది.

ఇది కూడా చదవండి: New York Mayor Elections: ట్రంప్‌కు భారీ షాక్.. న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ విజయం

వెండి ధరలు కూడా తగ్గాయి. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.500 తగ్గి.. రూ.1,50,500 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,63,000గా కొనసాగుతోంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో మాత్రం రూ.1, 50, 500 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న రమేష్‌కు షాకింగ్ వ్యాధి..!

Exit mobile version