Gold Rates: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలో మాత్రం స్వల్పంగా తగ్గుముఖం కనిపించింది. దేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు మహిళలు. ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. కాగా అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కొవిడ్, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650గా నమోదైంది. విజయవాడ, విశాఖలో కూడా ఇదే ధరలు ఉన్నాయి.
ఇక బంగారం ధర నిలకడగా ఉంటే.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర ఇలా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.60,900 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.66,300 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.66,300 ఉండగా, చెన్నైలో రూ.66,300 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.60,900 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.66,300 ఉంది. ఇక కేరళలో రూ.66,300 వద్ద కొనసాగుతోంది.
Also Read
- Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్‌ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్‌ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
- ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
- RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.
- దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010 ఉంది.
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 ఉంది.
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 వద్ద ఉంది.
- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద ఉంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010 వద్ద ఉంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010 ఉంది.
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద ఉంది.
తాజావార్తలు
-
Pakistani Cinema: నెట్‌ఫ్లిక్స్‌తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
-
HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?