మన దేశంలో బంగారానికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా మహిళలు బంగారం కొంటుంటారు. బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు అత్యంత ఆసక్తిని చూపిస్తారు. కరోనా ప్రారంభమైన నాటి నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల పసిడి ధర మరోసారి రూ.50వేలు కూడా దాటింది. అయితే కొన్నిరోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం కూడా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.
Read Also: కార్ల అమ్మకాల్లో కొత్త రికార్డు.. ఏడాదిలో కోటిపైగా విక్రయం
హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.49,100గా నమోదైంది. అటు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గి రూ.45 వేలకు చేరింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి ధర రూ.800 తగ్గి రూ.65,500గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమలులో ఉన్నాయి. మరోవైపు ఏపీలోని విశాఖ బులియన్ మార్కెట్‌లోనూ హైదరాబాద్ మార్కెట్ ధరలే ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.36 పెరిగి.. రూ.24,350 గా నమోదైంది. విశాఖ, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.