డబ్బుంటేనే అందరికీ మీరు అవసరం లేకపోతే ఎవరూ పట్టించుకోని పరిస్థితులు వచ్చేశాయ్. అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అందుకే అంతా డబ్బు సంపాదన కోసం పరుగెడుతున్నారు. వచ్చిన సంపాదనను వివిధ రూపాల్లో ఇన్వెస్ట్ చేసి లాభాలు అందుకోవాలని చూస్తున్నారు. అయితే పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలున్నాయి. వీటిల్లో పోస్టాఫీస్ అందించే స్కీమ్స్ బెస్ట్ అంటున్నారు నిపుణులు. పెట్టుబడి భద్రంగా ఉంటుంది. గ్యారంటీ రిటర్స్న్ అందుకోవచ్చు. అయితే ప్రతి నెల ఆదాయం కావాలనుకునే వారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీమ్ బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్ గా చెప్పొచ్చు.
Also Read:CM Chandrababu: బసవ తారకం ఆసుపత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్… తెలుగు జాతి ఉన్నంత వరకు ఉంటాయి
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీమ్ పోస్టాఫీస్ అందించే పాపులర్ స్కీముల్లో ఒకటి. పెన్షనర్లకు, రిటైర్ అవుతున్న వారికి, తక్కువ రిస్క్‌తో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది ఉత్తమమైన పెట్టుబడి పథకం. ఇందులో ఒకసారి పెట్టుబడి పెడితే చాలు 5 సంవత్సరాల పాటు ప్రతి నెలా వడ్డీ రూపంలో ఆదాయం పొందొచ్చు. మెచ్యూరిటి నాటికి పెట్టిన పెట్టుబడి చేతికి వస్తుంది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీమ్ లో సింగిల్‌గా, జాయింట్‌గా ముగ్గురు కలిసి ఖాతా తెరవొచ్చు. కనీసం రూ. 1000 నుంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించొచ్చు. సింగిల్ అకౌంట్ కింద రూ. 9 లక్షలు, జాయింట్ అకౌంట్ కింద రూ .15 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం ఇందులో 7.4 శాతం వడ్డీ రేటు లభిస్తోంది.
Also Read:Bribe: తవ్వే కొద్దీ బయటపడుతున్న గచ్చిబౌలి ఏడీఈ అక్రమాస్తులు..
ఈ పథకంలో సింగిల్ అకౌంట్ కింద గరిష్టంగా రూ. 9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 7.40 శాతం వడ్డీ రేటుతో ఐదేళ్లపాటు నెలవారీగా రూ. 5,550 చేతికి వస్తాయి. జాయింట్ అకౌంట్ కింద రూ. 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతి నెలా చేతికి రూ. 9,250 వస్తుంది. ప్రతి నెల ఆదాయం కావాలనుకునే వారు ఈ పథకంలో చేరొచ్చు. మీకు సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో POMIS ఖాతాను ప్రారంభించవచ్చు. Aadhar కార్డు, PAN కార్డు, చిరునామా, బాంక్ ఖాతా వివరాలు అందించి ఖాతాను ఓపెన్ చేయొచ్చు.