ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వార్యంలో యుఫోరియా పేరుతో మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తు్న్నారు. విజయవాడలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. బసవ తారకం ఆసుపత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్… తెలుగు జాతి ఉన్నంత వరకు ఉంటాయని అన్నారు. ఒక విషాదంలో ఒక మంచికి విత్తనం పడింది. అదే బసవ రామ తరకం ఆసుపత్రి. తాను సీఎం అయ్యాక ఈ ఆసుపత్రిని ఇంకా బాగా అభివృద్ధి చేశానని తెలిపారు. బాలకృష్ణ బసవతారకం ఆసుపత్రిని.. భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ని వారి తల్లిదండ్రుల పేరుతో సేవ చేస్తున్నారని కొనియాడారు. ఎన్టీఆర్ సేవా భావంలో ముందు ఉండేవారు.
Also Read:Bribe: తవ్వే కొద్దీ బయటపడుతున్న గచ్చిబౌలి ఏడీఈ అక్రమాస్తులు..
అవనిగడ్డలో తుఫాన్.. రాయలసీమలో కరువు ఇలా ప్రతి విషయంలో జనం దగ్గరకు ఎన్టీఆర్ వెళ్లి సహాయసహకారాలు అందించారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు సేవాభావంతో ఉండాలని చెప్పారు. సంపాదనలో కొంతమేర దాన ధర్మాలు చెయ్యాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఏదో చేయాలని తపన ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. లక్ష రూపాయల టికెట్ తీసుకోకుండా 50 లక్షల విరాళం ప్రకటించారని వెల్లడించారు. ఇంత మంచి కార్యక్రమనికి ఆదరణ ఇచ్చినందుకు శభాష్ విజయవాడ అనాల్సిoదేనని చంద్రబాబు మెచ్చుకున్నారు.
Also Read:Maha Kumbh: మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం.. మూడోసారి
మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక భరోసా అని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలో బ్లడ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.
తమన్ మ్యూజికల్ షో కు వచ్చే ప్రతి రూపాయి ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. 28 ఏళ్లుగా ప్రజల మనసులు గెలిచి ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందిస్తోందని వెల్లడించారు. వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్నో సేవలు అందించిందని అన్నారు. కోవిడ్ సమయంలో కూడా ట్రస్ట్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారని అన్నారు.