EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
- ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్
- జూలై 15 నాటికి వడ్డీ జమ
- 34 కోట్ల EPF ఖాతాల్లో రూ.1.44 లక్షల కోట్లకు పైగా వడ్డీ మొత్తాన్ని జమ చేయనుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని కోట్లాది ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తీపికబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం EPF వడ్డీని జూలై 15 నాటికి సభ్యుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 34 కోట్ల EPF ఖాతాల్లో రూ.1.44 లక్షల కోట్లకు పైగా వడ్డీ మొత్తాన్ని జమ చేయనుంది. ఈసారి కొత్త Centralised IT Enabled Services (CITES) వ్యవస్థ ద్వారా భారీ స్థాయిలో వడ్డీ పంపిణీ చేపడుతున్నట్లు EPFO తెలిపింది.
ప్రస్తుతం వెరిఫికేషన్ ప్రక్రియ
EPFO తెలిపిన వివరాల ప్రకారం, వడ్డీ జమ చేసే ముందు ఫీల్డ్ స్థాయిలో అన్ని వివరాలను పరిశీలించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా ధృవీకరణ (Verification) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ అవుతుంది. గతంలో EPF వడ్డీ రేటు ప్రకటించిన తర్వాత కూడా సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ కావడానికి అక్టోబర్ లేదా నవంబర్ వరకు వేచి చూడాల్సి వచ్చేది. అయితే కొత్త CITES డిజిటల్ వ్యవస్థ అమల్లోకి రావడంతో మొత్తం ప్రక్రియ ఆటోమేటిక్‌గా మారింది. దీంతో వడ్డీ జమ ప్రక్రియను చాలా వేగంగా పూర్తి చేయగలుగుతున్నారు.
Also Read
- Stock Market Crash: రక్తసిక్తమైన దలాల్ స్ట్రీట్.. స్టాక్ మార్కెట్లో నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయిన వేల కోట్లు!
- Crude Oil: ఇరాన్‌పై అమెరికా వార్.. చమురు ధరలు క్రాష్! భారత్‌లో లీటర్ పెట్రోల్ రేట్ ఎంతంటే?
- Meta: సోషల్ మీడియా చరిత్రలోనే నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్! మెటాకు ఏకంగా రూ.120 లక్షల కోట్ల జరిమానా?
- E25 Petrol in India: భారత ఇంధన రంగంలో మరో భారీ మార్పు.. E20 తర్వాత E21, E25..
CITES అంటే ఏమిటి?
Centralised IT Enabled Services (CITES) అనేది EPFO చేపట్టిన డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్. దీని ప్రధాన ఉద్దేశ్యం సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా, సులభంగా అందించడం. ఈ వ్యవస్థలో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతీయ కార్యాలయాల్లో ఉన్న సభ్యుల డేటాను ఒకే జాతీయ డేటాబేస్‌లోకి మార్చారు. దీంతో సభ్యుల సేవలు ఇకపై ఏ ఒక్క ప్రాంతీయ కార్యాలయానికీ పరిమితం కావు. దేశంలోని ఏ అధీకృత EPFO కార్యాలయం నుంచైనా సేవలు పొందే అవకాశం ఉంటుంది.
యూనిఫైడ్ మెంబర్ పోర్టల్
కొత్త వ్యవస్థలో EPF సభ్యులు ఒకే పోర్టల్ ద్వారా ఈ వివరాలను తెలుసుకోవచ్చు. EPF ఖాతా వివరాలు, PF బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్, పెన్షన్‌కు సంబంధించిన సేవా రికార్డులు, ఇతర ప్రయోజనాలు.
క్లెయిమ్ ప్రక్రియ మరింత సులభం
కొత్త CITES ప్లాట్‌ఫారమ్ ద్వారా క్లెయిమ్ దాఖలు చేసే ముందే సభ్యుల అర్హతను ఆటోమేటిక్‌గా పరిశీలిస్తుంది. అవసరమైన పత్రాలు లేకపోయినా లేదా అనుమతించిన పరిమితికి మించి క్లెయిమ్ చేసినా సభ్యులకు ముందుగానే సమాచారం అందుతుంది. దీంతో క్లెయిమ్ తిరస్కరణలు తగ్గే అవకాశం ఉంది.
ఆటో సెటిల్మెంట్ పరిమితి పెంపు
EPFO మరో కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తిగా KYC పూర్తి చేసిన సభ్యులకు అడ్వాన్స్ క్లెయిమ్ ఆటో సెటిల్మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచింది. అదనపు వివరాలు అవసరమైతే సభ్యులు ఆన్లైన్లోనే సమర్పించవచ్చు. దీంతో కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. కొత్త కేంద్రికృత చెల్లింపు విధానం ద్వారా క్లెయిమ్ ఆమోదం పొందిన రోజే సభ్యుల బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
PF సెటిల్మెంట్పై ఎక్కువ వడ్డీ
ఇకపై తుది PF సెటిల్మెంట్పై కూడా సభ్యులకు ఎక్కువ ప్రయోజనం లభించనుంది. గతంలో నెలాఖరు వరకు మాత్రమే వడ్డీ లెక్కించేవారు. ఇప్పుడు తుది చెల్లింపుకు అనుమతి ఇచ్చే తేదీ వరకు వడ్డీ లెక్కిస్తారు. దీంతో సభ్యులకు మరింత ఎక్కువ మొత్తం లభించే అవకాశం ఉంటుంది.
పాక్షిక ఉపసంహరణ నిబంధనల్లో మార్పులు
గతంలో ఉన్న 13 రకాల PF ఉపసంహరణ నిబంధనలను EPFO ఇప్పుడు మూడు ప్రధాన విభాగాలుగా సరళీకరించింది. అత్యవసర అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు, అర్హత ఉన్న సభ్యులు నిబంధనల ప్రకారం తమ PF బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు.
ఉద్యోగం మారితే PF ఖాతా ఆటోమేటిక్‌గా బదిలీ
ఆధార్‌తో అనుసంధానమైన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) కలిగిన ఉద్యోగులు ఉద్యోగం మారినప్పుడు PF ఖాతా ఆటోమేటిక్‌గా కొత్త సంస్థకు బదిలీ అవుతుంది. దీంతో పెన్షన్ సేవా కాలంలో ఎలాంటి అంతరాయం ఉండదు.
EPS పెన్షనర్లకు కూడా ప్రయోజనం
కొత్త వ్యవస్థ ద్వారా EPS పెన్షన్ పొందుతున్న వారికి కూడా సేవలు మరింత సులభం కానున్నాయి. దేశంలోని ఏ EPFO కార్యాలయంలోనైనా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే అవకాశం ఉంటుంది. అలాగే Centralised Pension Payment System (CPPS) ద్వారా భారతదేశంలోని ఏ బ్యాంకు ఖాతాలోనైనా పెన్షన్ పొందవచ్చు.
- Tags
- EPF interest
- epfo
తాజావార్తలు
-
EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
-
Thaman: పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్‌కు ‘OG 2’ ఆల్బమ్ అంకితం
-
Maruthi : ‘రాజాసాబ్’ తర్వాత మొదటిసారిగా మీడియా ముందుకు మారుతి ఫస్ట్
-
NBK SDT : మెగా హీరో సెట్స్ లో నందమూరి బాలయ్య సందడి
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
ట్రెండింగ్
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?