Danger Link: సైబర్ నేరగాళ్ల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. సోషల్ మీడియా ఉంది కదా అని ఫేక్ లింకులను నేరగాళ్లు తెగ సర్క్యులేట్ చేస్తున్నారు. ఇండిపెండెన్స్ డే ఆఫర్ అని.. రీ ఛార్జ్ ఆఫర్ అని.. కంపెనీ వార్షికోత్సవం అంటూ రకరకాలుగా అమాయకులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయం తెలియక ఆఫర్లు అని పొరబడి చాలా మంది ఫేక్ లింకులను క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోతున్నారు. తాజాగా ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ పేరుతో ఓ లింకును వాట్సాప్‌లో వైరల్ చేస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. ఈ లింక్ ఓపెన్ చేసిన వారికి క్విజ్ పేరుతో కొన్ని ప్రశ్నలు కనిపిస్తాయి. వాటికి సమాధానాలు ఇస్తే యూరప్ ట్రిప్ టిక్కెట్లను ఉచితంగా గెలుచుకోవచ్చని ఆ సందేశంలో ఉంటుంది.
అంతేకాకుండా ఈ లింకును ఫ్రెండ్స్‌కు షేర్ చేయాలని ఆ సందేశంలో ఉంటుంది. కనీసం 30 మంది స్నేహితులకు లేదా ఐదు వాట్సాప్ గ్రూపులకు పంపించాలని కోరుతుంది. ఒకవేళ ఈ లింకులో చెప్పినట్లు మీరు నమ్మి షేర్ చేస్తే మీతో పాటు మీ సన్నిహితులు కూడా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. వాట్సాప్‌లో వైరల్ అవుతున్న ఈ సందేశంలో షార్ట్ URL రూపంలో ఓ లింక్ కనిపిస్తోంది. లింక్ ప్రివ్యూ మాత్రం అచ్చం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌ను పోలి ఉంది. ఇలాంటి లింకులు కేవలం మొబైల్లోనే ఓపెన్ అవుతాయి. ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న లింక్ సైతం మొబైల్లో మాత్రమే ఓపెన్ అవుతోంది. ఎందుకంటే మొబైల్లో మన ఈ-మెయిల్, ఇతర పేమెంట్స్ యాప్‌ల సమాచారం లాగిన్ చేసి ఉంటుంది. కనుక మొబైల్లో మాత్రమే ఈ లింక్ ఓపెన్ అయ్యేలా సైబర్ నేరగాళ్లు డిజైన్ చేశారు. ఈ లింక్ క్లిక్ చేస్తే ఎమిరేట్స్ వెబ్‌సైట్‌ను పోలి ఉన్న మరో సైట్‌కు రీడైరెక్ట్ అవుతోంది. ఒకవేళ మీరు ఈ లింక్ క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలో పెట్టినట్లు అవుతుంది. అందువల్ల ఇలాంటి లింకుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
@emirates is this a scam? pic.twitter.com/CWeebGEHwy
— Bibi (@blightybibi) August 4, 2022