Indias trade: విదేశాల్లో భారతీయ వస్తువులకు డిమాండ్..భారీగా పెరిగిన ఎగుమతులు
- విదేశాల్లో భారతీయ వస్తువులకు విపరీతమైన డిమాండ్
- వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాత్కాలిక వాణిజ్య సమాచారం
- జూన్ త్రైమాసికంలో $200.3 బిలియన్లకు చేరిన ఎగుమతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విదేశాల్లో భారతీయ వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉందని ఎగుమతి లెక్కలు చెబుతున్నాయి. సోమవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాత్కాలిక వాణిజ్య డేటా ప్రకారం.. భారతదేశం మొత్తం ఎగుమతులు (వస్తువులు మరియు సేవలతో సహా) ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో $200.3 బిలియన్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో $184.5 బిలియన్లు గా ఉండింది. జూన్‌లో దేశంలో వస్తువుల ఎగుమతులు 2.56 శాతం పెరిగి 35.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తెలిపారు. ఏడాది క్రితం ఇదే నెలలో ఎగుమతులు 34.32 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. జూన్‌లో దిగుమతులు దాదాపు 5 శాతం పెరిగాయి. 56.18 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో 53.51 బిలియన్ డాలర్లుగా ఉండింది.
READ MORE: Punjab: పంజాబ్లో ఆయుధ స్మగ్లింగ్ రాకెట్ను ఛేదించిన పోలీసులు..
Also Read
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
- N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి 'చంద్రశేఖరన్' రాజీనామా?
- Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
జూన్‌లో దేశ వాణిజ్య లోటు (దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసం) 20.98 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం వస్తువులు, సేవల ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను దాటుతుందని సునీల్ బర్త్‌వాల్ అశాభావం వ్యక్తం చేశారు. 2024-25 మొదటి త్రైమాసికంలో వస్తువులు, సేవల ఎగుమతి సుమారు 200 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిపారు. సుమారు 800 బిలియన్ డాలర్లను దాటడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. మే నెలలో భారత సరుకుల ఎగుమతులు 9.1 శాతం పెరిగి 38.13 బిలియన్ డాలర్లకు చేరుకోగా, వాణిజ్య లోటు ఏడు నెలల గరిష్ట స్థాయి 23.78 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో ఎగుమతులు 5.84 శాతం పెరిగి 109.96 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 7.6 శాతం పెరిగి 172.23 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇంకా భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు విజయవంతంగా పూర్తయిన సర్జరీ
-
Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
-
YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
-
IND vs SL 1st Test: తొలి టెస్టుకు శ్రీలంక జట్టు ప్రకటన.. ఊహించని ఆటగాళ్లకు చోటు.. టీమిండియాకు చుక్కలే!
-
YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..