Delimitation: లోక్‌సభలో సీట్లు పెరిగితే ఖర్చుల సంగతేంటి? పూర్తి లెక్కలివే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delimitation: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం ఇప్పుడు దేశంలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభలో ఎంపీల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి సుమారు 815కు పెంచే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 50 శాతం సీట్ల పెంపు నమూనాను ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అయితే ఎంపీల సంఖ్య పెరగడం అంటే పార్లమెంట్లో సీట్లు పెంచడమే కాదు.. వారి జీతాలు, భత్యాలు, వసతి, కార్యాలయాలు, సిబ్బంది, ప్రయాణ సౌకర్యాల కోసం ప్రభుత్వానికి అదనపు వ్యయం కూడా తప్పదు. మరి 815 మంది ఎంపీలు ఉంటే ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుంది? ఆ వివరాలు తెలుసుకుందాం.
545 నుంచి 815కు.. ఎంతమంది ఎంపీలు పెరుగుతారు?
ప్రస్తుతం లోక్‌సభలో 543 మంది ఎన్నికైన సభ్యులకు ప్రాతినిధ్యం ఉంది. ప్రతిపాదిత 50 శాతం పెంపు అమలైతే ఈ సంఖ్య సుమారు 815కు చేరవచ్చు. అంటే దాదాపు 272 మంది ఎంపీలు అదనంగా వస్తారు. అయితే కొన్ని అంచనాల్లో ప్రస్తుత సంఖ్యను 545గా తీసుకుని 270 మంది పెరుగుతారని లెక్కిస్తున్నారు. ఇవి ప్రతిపాదిత పెంపుపై ఆధారపడిన అంచనాలు మాత్రమే. తుది సంఖ్య డీలిమిటేషన్ ప్రక్రియ, చట్టపరమైన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఈ మార్పు కేవలం లోక్‌సభకే పరిమితం కాకపోవచ్చు. రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను కూడా పునర్విభజించే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం ఉన్న సుమారు 4,123 అసెంబ్లీ స్థానాలు 6,185 నుంచి 6,186 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అసెంబ్లీ స్థానాల పెంపుపై ఇంకా తుది సంఖ్య ఖరారు కాలేదు.
Also Read
- Tata Group: టాటా గ్రూప్‌లో కుమ్ములాట.. హైకోర్టు మెట్లు ఎక్కిన ట్రస్టులు!
- TRAI New Rules: జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ షాక్.. ఇక చౌక రీఛార్జ్ ప్లాన్లు మొదట కనిపించాల్సిందేనా..?
- Funeral Pre-Booking: ఇదేం వింత బిజినెస్ భయ్యా.. సొంత అంత్యక్రియలకు ముందే అడ్వాన్స్ బుకింగ్!
- December 2026 Updates: కొత్త నెల, కొత్త రూల్స్.. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రాబోతున్న పెద్ద మార్పులివే!
ఒక్కో ఎంపీకి నెలకు ఎంత ఖర్చవుతుంది?
ఎంపీలకు ప్రభుత్వం కేవలం జీతం మాత్రమే చెల్లించదు. నియోజకవర్గ భత్యం, కార్యాలయ ఖర్చుల భత్యం కూడా అందిస్తుంది. 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన రేట్ల ప్రకారం ఒక్కో ఎంపీకి నెలకు అందే మొత్తం ఇలా ఉంటుంది.
– నెలసరి జీతం: రూ.1,24,000
– నియోజకవర్గ భత్యం: రూ.87,000
– కార్యాలయ ఖర్చుల భత్యం: రూ.75,000
ఈ మూడింటినీ కలిపితే ఒక్కో ఎంపీకి నెలకు రూ.2.86 లక్షలు అవుతుంది. ఈ మొత్తంలో కార్యాలయ నిర్వహణ, స్టేషనరీ, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న సహాయకుల సేవలకు సంబంధించిన ఖర్చులు కూడా ఉంటాయి. అంటే.. ప్రస్తుత సంఖ్యను 545గా తీసుకుని, కొత్తగా 270 మంది ఎంపీలు వస్తారని లెక్కిస్తే జీతాలు, నియోజకవర్గ భత్యాలు, కార్యాలయ భత్యాల రూపంలో ప్రభుత్వానికి అదనపు ఖర్చు పెరుగుతుంది. 270 మంది × రూ.2.86 లక్షలు = నెలకు సుమారు రూ.7.72 కోట్లు. అంటే ఏడాదికి సుమారు రూ.92.66 కోట్లు ఖర్చవుతుంది. ఇది కేవలం జీతాలు, రెండు రకాల భత్యాలకు సంబంధించిన అంచనా మాత్రమే. ఎంపీలకు కల్పించే ఇతర సౌకర్యాలు ఇందులో లేవు. ఇక, ఎంపీలకు పార్లమెంట్ సమావేశాలు లేదా విధులకు హాజరైన అర్హత కలిగిన రోజులకు రోజువారీ భత్యం కూడా చెల్లిస్తారు. ప్రస్తుతం ఈ మొత్తం రోజుకు రూ.2,500గా ఉంది. ఒకవేళ కొత్తగా వచ్చే 270 మంది ఎంపీలు ఏడాదికి 60 రోజుల పాటు ఈ భత్యానికి అర్హులైతే అదనంగా సుమారు రూ.4.05 కోట్లు ఖర్చవుతుంది. అయితే ఈ మొత్తం ఎంపీల హాజరు, సమావేశాల రోజులు, నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.
కొత్త ఎంపీలకు ఇళ్లు, వసతి సౌకర్యాలు!
ఎంపీల సంఖ్య పెరిగితే ఢిల్లీలో వారికి ప్రభుత్వ నివాసాలు కేటాయించాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చే ఎంపీల కోసం సుమారు 270 ఇళ్లు లేదా ఫ్లాట్లు అవసరమవుతాయి. వీటితో పాటు ఫర్నిచర్, మరమ్మతులు, విద్యుత్, నీరు, టెలిఫోన్, ఇతర సౌకర్యాలను కూడా కల్పించాలి. ఎంపీల సీనియారిటీ, అందుబాటులో ఉన్న వసతులను బట్టి నివాసాల కేటాయింపు ఉంటుంది. ఈ వసతుల నిర్వహణకు అయ్యే మొత్తం ఖర్చుపై ప్రస్తుతానికి ఏకరీతి అధికారిక అంచనా అందుబాటులో లేదు. ప్రతి ఎంపీకి ఢిల్లీలో, తన నియోజకవర్గంలో కార్యాలయాలు అవసరం. వీటి నిర్వహణకు సిబ్బంది, కంప్యూటర్లు, స్టేషనరీ, ఇతర పరికరాలు కావాలి. ఎంపీల సంఖ్య పెరిగితే పార్లమెంట్ సచివాలయంలోనూ అదనపు సిబ్బంది అవసరం ఏర్పడవచ్చు. పార్లమెంటరీ కమిటీలు, భద్రత, రికార్డుల నిర్వహణ, సాంకేతిక వ్యవస్థలు, సభా కార్యకలాపాలపై కూడా ఖర్చు పెరిగే అవకాశం ఉంది. అయితే ఎంపీల సంఖ్య 50 శాతం పెరిగిందని ఈ ఖర్చులన్నీ కూడా అదే నిష్పత్తిలో పెరుగుతాయని చెప్పలేం.
ఎంపీల్యాడ్స్ నిధుల రూపంలో మరో రూ.1,350 కోట్ల భారం?
ఎంపీల్యాడ్స్ (MPLADS) పథకం కింద ఒక్కో ఎంపీ తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఏటా రూ.5 కోట్ల వరకు నిధులను సిఫార్సు చేయవచ్చు. ప్రస్తుతం ఈ పథకం కింద ప్రతి ఎంపీకి ఏడాదికి రూ.5 కోట్ల కేటాయింపు ఉంది. ఈ పథకం కొత్త ఎంపీలకూ యథాతథంగా వర్తిస్తే, అదనంగా వచ్చే 270 మంది ఎంపీల కోసం ఏడాదికి రూ.1,350 కోట్ల మేర అభివృద్ధి నిధులు అవసరమవుతాయి. అయితే ఇది ఎంపీల వ్యక్తిగత జీతం లేదా ఆదాయం కాదు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు వినియోగించాల్సిన ప్రభుత్వ నిధులు మాత్రమే. అంతేకాదు.. ఎంపీల సంఖ్య పెరిగినంత మాత్రాన ఎన్నికల నిర్వహణ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని చెప్పలేం. ఎన్నికల ఖర్చులో ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఎన్నికల సిబ్బంది వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే అదనపు నియోజకవర్గాల ఏర్పాటు, వాటి సరిహద్దుల నిర్ణయం, ఎన్నికల రికార్డుల నిర్వహణ, పరిపాలనా పనుల కోసం కొంత అదనపు వ్యయం అవసరమవుతుంది.
డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు ఎంత ఖర్చు?
నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించేందుకు డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కమిషన్ ఛైర్మన్, సభ్యుల జీతభత్యాలు, కార్యాలయ నిర్వహణ, సిబ్బంది, ఇతర పరిపాలనా ఖర్చులను కేంద్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. డీలిమిటేషన్ ప్రక్రియలో ఎన్నికల సంఘానికి వచ్చే అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. అయితే కమిషన్ ఏర్పాటు, మొత్తం ప్రక్రియకు అయ్యే వ్యయంపై ముందుగానే కచ్చితమైన అంచనా వేయడం కష్టం. 2026-27 కేంద్ర బడ్జెట్లో పార్లమెంట్ ఉభయ సభల నిర్వహణ కోసం మొత్తం రూ.1,492 కోట్లు కేటాయించారు. ఇందులో లోక్‌సభకు రూ.1,009 కోట్లు, రాజ్యసభకు రూ.482.99 కోట్లు కేటాయించారు.
లోక్‌సభకు సంబంధించిన ఖర్చుల్లో ముఖ్యమైనవి:
– స్పీకర్, డిప్యూటీ స్పీకర్ జీతభత్యాలు: రూ.1.56 కోట్లు
– ఎంపీల జీతాలు, భత్యాలు, సౌకర్యాలు: రూ.416.45 కోట్లు
– లోక్‌సభ సచివాలయ నిర్వహణ: రూ.586.03 కోట్లు
ఎంపీల సంఖ్య పెరిగితే పార్లమెంట్ నిర్వహణ, సిబ్బంది, ఇతర పరిపాలనా ఖర్చులపై కూడా అదనపు భారం పడే అవకాశం ఉంది.
అసెంబ్లీ సీట్లు పెరిగితే రాష్ట్రాలపై కూడా భారం!
లోక్‌సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్య కూడా పెరిగితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. సుమారు 2,000 మంది ఎమ్మెల్యేలు అదనంగా వచ్చే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. వీరికి జీతాలు, భత్యాలు, కార్యాలయాలు, సిబ్బంది, ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల నెలవారీ జీతాలు, భత్యాలు కలిపి సుమారు రూ.90 వేల నుంచి రూ.3.45 లక్షల వరకు ఉంటాయి. వార్షికంగా ఒక్కో ఎమ్మెల్యేపై రూ.10.8 లక్షల నుంచి రూ.41.4 లక్షల వరకు ఖర్చవుతుంది. దీనికి అదనంగా రాష్ట్రాలను బట్టి ఎమ్మెల్యేల స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులు కూడా ఉంటాయి. అయితే ప్రతి రాష్ట్రంలో జీతాలు, భత్యాలు, అభివృద్ధి నిధులు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి మొత్తం అదనపు వ్యయాన్ని ఇప్పుడే కచ్చితంగా లెక్కించడం సాధ్యం కాదు. మొత్తంగా చూస్తే డీలిమిటేషన్ వల్ల లోక్‌సభ, అసెంబ్లీల్లో ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం కూడా పెరిగే అవకాశం ఉంది. జీతాలు, భత్యాలు మాత్రమే కాకుండా వసతి, సిబ్బంది, కార్యాలయాలు, అభివృద్ధి నిధులు, పార్లమెంట్ నిర్వహణ వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడే అసలు ఖర్చుపై స్పష్టత వస్తుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam Day 14 LIVE: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణోత్సవం.. ఒకే వేదికపై విశేష కార్యక్రమాలు
-
Delimitation: లోక్‌సభలో సీట్లు పెరిగితే ఖర్చుల సంగతేంటి? పూర్తి లెక్కలివే!
-
Tata Group: టాటా గ్రూప్‌లో కుమ్ములాట.. హైకోర్టు మెట్లు ఎక్కిన ట్రస్టులు!
-
MLA Arul Vignesh Arrest: తమిళనాడు రాజకీయాల్లో కలకలం.. టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ అరెస్ట్
-
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ హెయిర్ కేర్ సీక్రెట్ ఇదే!
-
Sharad Pawar: డీలిమిటేషన్‌పై ఎన్సీపీ సంచలన నిర్ణయం.. ఇండియా కూటమికి షాక్..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!