Copper Prices: బంగారం, వెండి బాటలోనే రాగి.. ఇక ఏసీలు, ఫ్రిడ్జ్‌లు చౌకగా దొరుకుతాయా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Copper Prices: బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఇప్పుడు ‘రెడ్ గోల్డ్’గా పిలిచే రాగి (కాపర్) రేట్లు కూడా భారీగా పడిపోతున్నాయి. లండన్ మార్కెట్ నుంచి మన దేశీయ మార్కెట్ వరకు గత నెల రోజుల్లోనే కాపర్ ధర 10 శాతానికి పైగా క్షీణించి, ఏడు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఈ పరిణామం ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీలకు పెద్ద ఊరటనిస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు నాలుగు సార్లు ధరలు పెంచి సామాన్యులకు షాకిచ్చిన ఏసీ, ఫ్రిడ్జ్ కంపెనీలు.. ఇప్పుడు రాగి ధర దిగిరావడంతో మళ్లీ రేట్లు తగ్గిస్తాయా అన్న చర్చ మొదలైంది.
నవంబర్ 19న అంతర్జాతీయ మార్కెట్లో కాపర్ ధరలు కుప్పకూలాయి. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ (LME)లో మూడు నెలల కాపర్ ఫ్యూచర్ ధర ఒక్కరోజే 4.6 శాతం తగ్గి టన్నుకు 12,471 డాలర్లకు చేరింది. గత నెల రోజుల్లో అక్కడ 13 శాతానికి పైగా ధర తగ్గడం విశేషం. ఇక మన దేశంలోని మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లోనూ గురువారం కాపర్ ధర 1.60 శాతం తగ్గి కిలో రూ.1,192 వద్ద ముగిసింది. నవంబర్ నెలలోనే దేశీయంగా రాగి ధర దాదాపు 15 శాతం పడిపోయింది.
Also Read
- PUC New Rules 2026: కారు, బైక్ యజమానులకు గుడ్ న్యూస్.. ఇక 3 ఏళ్ల వరకు PUC రెన్యువల్ అవసరం లేదు!
- EPFO New Rules 2026: పీఎఫ్ ఖాతాదారులకు జాక్‌పాట్.. ఇకపై 90% డబ్బు మీ చేతికే! కొత్త రూల్ ఇదే..
- Nifty 50: పరుగులు పెడుతున్న నిఫ్టీ 50.. 52 వారాల గరిష్టానికి చేరుతుందా..?
- Wedding Business: 25 రోజుల్లో రూ.7.50 లక్షల కోట్ల వ్యాపారం.. పెళ్లిళ్ల జోరు మామూలుగా లేదుగా!
అసలు కాపర్ ధరలు ఇంతలా పడిపోవడానికి ప్రధానంగా మూడు అంతర్జాతీయ కారణాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా రాగిని వాడే చైనాలో ఫ్యాక్టరీల కార్యకలాపాలు, రియల్ ఎస్టేట్ రంగం మందగించడంతో డిమాండ్ తగ్గుతుందన్న అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు అమెరికన్ డాలర్ బలపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠినంగా వ్యవహరిస్తుందన్న భయాలు మెటల్ మార్కెట్‌పై ఒత్తిడి పెంచాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ల విస్తరణ వల్ల రాగికి విపరీతమైన డిమాండ్ ఉంటుందని ఇన్నాళ్లూ భావించారు కానీ, ఇప్పుడు ఆ పెట్టుబడుల స్థిరత్వంపై సందేహాలు తలెత్తడంతో ధరలు కిందకు దిగొచ్చాయి.
కాపర్ ధర తగ్గడం స్టాక్ మార్కెట్లో ఏసీ, ఫ్రిడ్జ్ కంపెనీల షేర్లకు బాగా కలిసొచ్చింది. ముడిసరుకు ఖర్చు తగ్గి కంపెనీల లాభాలు పెరుగుతాయన్న అంచనాతో నవంబర్ 18న వోల్టాస్ షేర్ ఏకంగా 9 శాతం ఎగబాకింది. బ్లూ స్టార్ 8.94 శాతం, అంబర్ ఎంటర్ప్రైజెస్ 7.61 శాతం, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ 7.03 శాతం చొప్పున లాభపడ్డాయి. ఎస్బీఐ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం.. ఒక ఏసీ తయారీ ఖర్చులో కాపర్ వాటా 10 నుంచి 25 శాతం వరకు ఉంటుంది. ఏసీ కంప్రెసర్, మోటార్, వైరింగ్, కాయిల్స్‌లో రాగిని విరివిగా వాడతారు. అయితే కాపర్ ధర తగ్గినంత మాత్రాన రేపటి నుంచే ఏసీలు, ఫ్రిడ్జ్‌లు చౌకగా దొరుకుతాయని చెప్పలేం. ఎందుకంటే కంపెనీల దగ్గర ఇప్పటికే ఎక్కువ రేటు పెట్టి కొన్న పాత ముడిసరుకు నిల్వలు ఉంటాయి. దీనికి తోడు స్టీల్, అల్యూమినియం ధరలు, రూపాయి విలువ కూడా తయారీ ఖర్చును ప్రభావితం చేస్తాయి. కాపర్ ధరలు ఇదే స్థాయిలో మరికొంత కాలం కొనసాగితే, రాబోయే రోజుల్లో కంపెనీల మధ్య పోటీ పెరిగి కస్టమర్లకు మంచి డిస్కౌంట్లు లేదా ధరల తగ్గింపు రూపంలో ఊరట లభించే అవకాశం ఉంది.
ముడిసరుకు ధరల పెరుగుదల, రూపాయి పతనం, జనవరి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త బీఈఈ (BEE) స్టార్ రేటింగ్ రూల్స్ కారణంగా ఈ ఏడాది కంపెనీలు వినియోగదారులపై భారీగా భారం మోపాయి. ఎల్జీ కంపెనీ జనవరిలో 7-9 శాతం, అక్టోబర్‌లో 5-7 శాతం వరకు ఏసీ ధరలను పెంచింది. డైకిన్ ఏప్రిల్‌లో 7-12 శాతం, తిరిగి అక్టోబర్‌లో 6-10 శాతం చొప్పున రేట్లు సవరించింది. వోల్టాస్ ఏడాది పొడవునా దశలవారీగా 5 నుంచి 15 శాతం వరకు ధరలు పెంచుతూ వచ్చింది. బ్లూ స్టార్ ఫిబ్రవరిలో 8-10 శాతం, అక్టోబర్ పండుగ సీజన్లో మరో 5-8 శాతం వరకు పెంచింది. ఇక హయర్ మార్చి నెలలో ఏసీలపై 5-8 శాతం రేట్లు పెంచగా, గోద్రెజ్ ఏప్రిల్ నెలలో వివిధ హోమ్ అప్లయన్సెస్‌పై 6-10 శాతం వరకు ధరలు పెంచింది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల విస్తరణ వల్ల రాగికి మళ్లీ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికైతే ఈ ధరల తగ్గుదల ఏసీ, ఫ్రిడ్జ్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఒక ఆశాజనకమైన వార్తగానే చెప్పుకోవచ్చని అంటున్నారు.
తాజావార్తలు
-
Copper Prices: బంగారం, వెండి బాటలోనే రాగి.. ఇక ఏసీలు, ఫ్రిడ్జ్‌లు చౌకగా దొరుకుతాయా?
-
Suryakumar Yadav: “ప్రధాని మోడీని కలిశాకే నా లక్ మారింది.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చా”.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Lamborghini Temerario Spyder: 920HP ఇంజిన్‌తో Lamborghini కొత్త సూపర్‌కార్.. 343 kmph టాప్ స్పీడ్
-
Koti Deepotsavam 2026 Day 7: కార్తీక శుక్రవారం.. ప్రబోధిని ఏకాదశి.. కోటి దీపోత్సవంలో నేటి విశేషాలివే!
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!