Cigarette Price Hike: సిగరెట్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. మే నెలలో పెరగనున్న సిగరెట్ ధరలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cigarette Price Hike: సిగరెట్ లవర్‌కు భారీ షాక్ తగిలే వార్త ఇది. దేశవ్యాప్తంగా సిగరెట్ ధరలు మే నెల నుంచి గణనీయంగా పెరకబోతున్నాయని సమాచారం. కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై పన్నులను పెంచుతూ తీసుకున్న నిర్ణయం ప్రభావం ఇప్పుడు సిగరెట్ ధరలపై పడబోతోంది. దేశీ దిగ్గజ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను ఏకంగా 17 శాతం వరకు పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ వార్త వెలువడగానే స్టాక్ మార్కెట్లో సిగరెట్ కంపెనీల షేర్లు రాకెట్లా దూసుకుపోయాయి.
ఎంత పెరగనున్నాయంటే..
మీడియా నివేదికల ప్రకారం.. ఐటీసీ (ITC) కి చెందిన పాపులర్ బ్రాండ్ గోల్డ్‌ఫ్లేక్ ప్రీమియం ప్యాక్ ధర ప్రస్తుతం ఉన్న రూ.115 నుంచి సుమారుగా రూ.135కు పెరగనుంది. అంటే ఒక్కో సిగరెట్ మీద కనీసం రూ.2 నుంచి రూ.3 వరకు భారం పడవచ్చు. ఈ ధరల మంట ఎందుకంటే.. ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంట్ ఆమోదించిన సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు, 2025 ప్రకారం పొగాకు ఉత్పత్తులపై సుంకాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. సిగరెట్లపై అదనంగా 40 శాతం జీఎస్టీ విధించబడుతుంది. సిగరెట్ పొడవును బట్టి ప్రతి 1,000 సిగరెట్లపై రూ.2,050 నుంచి రూ.8,500 వరకు ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ముఖ్యంగా 75-85 మిల్లీమీటర్ల పొడవున్న సిగరెట్ల ధర 22-28 శాతం పెరిగే అవకాశం ఉందని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
ధరల పెంపు వార్త ఇన్వెస్టర్లకు కిక్కునిచ్చింది. ధరలు పెరిగితే కంపెనీ లాభాలు మెరుగవుతాయన్న ఆశతో ఈ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 8% పెరిగి రూ.2,280 వద్ద ట్రేడయ్యాయి. గత నెల రోజుల్లోనే ఈ స్టాక్ 21% లాభపడటం విశేషం. మార్కెట్ లీడర్ ఐటీసీ షేర్లు 4% లాభపడి రూ.315.95 వద్ద స్థిరపడ్డాయి. గత నెల రోజుల్లో ఈ షేర్ 10% వృద్ధిని నమోదు చేసింది. సిగరెట్ ధరల పెంపు వల్ల కంపెనీల ఆదాయం పెరిగినా, గత ఆరు నెలల కాలంలో ఈ రెండు కంపెనీల షేర్లు ఇంకా 25-27 శాతం నష్టాల్లోనే ఉండటం గమనార్హం. తాజా ధరల పెంపుతో ఈ నష్టాల నుంచి కంపెనీలు కోలుకుంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!