CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CIBIL Score: ఇల్లు కొనుక్కోవాలన్నా లేదా అత్యవసర అవసరాల కోసం పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా మీ ‘సిబిల్’ (CIBIL – క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్) స్కోర్ బెటర్‌గా ఉండాలి. 300 నుంచి 900 పాయింట్ల మధ్య ఉండే ఈ మూడంకెల సంఖ్య, మీరు గతంలో తీసుకున్న అప్పులను ఎంత బాధ్యతాయుతంగా తీర్చారో చెప్పే రిపోర్ట్ కార్డులా పనిచేస్తుంది. మీ స్కోర్ 900 కి ఎంత దగ్గరగా ఉంటే, బ్యాంకులకు మీపై అంత నమ్మకం పెరుగుతుంది. అలాగే లోన్ ఎగవేసే ప్రమాదం తక్కువగా ఉందని బ్యాంకులు భావిస్తాయి. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ పొందడం కాస్త కష్టమే. అయితే, ఇటీవలి కాలంలో ఈఎంఐలు ఆలస్యం కావడం, క్రెడిట్ కార్డ్ వాడకం హద్దులు దాటడం లేదా రిపోర్టులో తప్పుడు వివరాలు పడటం వల్ల స్కోర్ తగ్గి ఉంటే, కేవలం 6 నెలల్లోనే దాన్ని మళ్లీ గాడిలో పెట్టే అవకాశం ఉంది. మీ ప్రస్తుత క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా ఈ మార్పు ఎంత వేగంగా జరుగుతుందనేది ఆధారపడి ఉంటుంది. సిబిల్ స్కోర్ అనేది మనం చెల్లించే రీపేమెంట్ హిస్టరీ, క్రెడిట్ యుటిలైజేషన్, ఎంతకాలంగా క్రెడిట్ వాడుతున్నారనే వయస్సు, లోన్ ఎంక్వైరీల ఆధారంగా మారుతుంటుంది. అందుకే కేవలం ఏదో ఒక కొత్త లోన్ లేదా క్రెడిట్ కార్డ్ తీసుకుంటే సరిపోదు, అసలు స్కోర్ ఎందుకు తగ్గిందో తెలుసుకుని దానికి తగ్గట్టు అడుగులు వేయాలి.
1. సకాలంలో ఈఎంఐ చెల్లింపు..
మీ స్కోర్‌ను వేగంగా పెంచుకోవడానికి మొదటి, అత్యంత కీలకమైన సూత్రం ప్రతి నెల క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ ఈఎంఐలను గడువు తేదీ దాటకుండా సమయానికి చెల్లించడం. బిల్లులు ఆలస్యంగా కట్టినా లేదా పూర్తిగా ఎగ్గొట్టినా స్కోర్ దారుణంగా పడిపోతుంది. పాత బాకీలు ఏవైనా ఉంటే ముందు వాటిని క్లియర్ చేయడం మంచిది, అయితే పాత నెగెటివ్ హిస్టరీ వెంటనే చెరిగిపోదని గుర్తుంచుకోండి.
Also Read
- 1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
- Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
- BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
2. క్రెడిట్ కార్డుల పరిమితి..
మీ వద్ద ఉన్న క్రెడిట్ కార్డుల పరిమితిని (పరిమితిలో 30% కంటే ఎక్కువ) పూర్తిగా వాడేయకూడదు. సమయానికి బిల్లులు కడుతున్నాం కదా అని కార్డ్ లిమిట్ మొత్తాన్ని వాడేస్తూ ఉంటే అది మీ ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. కాబట్టి అనవసర ఖర్చులను తగ్గించుకుని క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
3. ఎక్కువగా లోన్స్ అప్లై చేయొద్దు..
తక్కువ వ్యవధిలో వరుసగా పలు బ్యాంకులు లేదా యాప్‌లలో లోన్ల కోసం దరఖాస్తు చేయకూడదు. ప్రతి దరఖాస్తు వద్ద ల్యాండర్లు మీ క్రెడిట్ రిపోర్టును పరిశీలిస్తారు (హార్డ్ ఎంక్వైరీ), దీనివల్ల మీ స్కోర్ మరింత తగ్గుతుంది. ఒకవేళ మీ లోన్ రిజెక్ట్ అయితే, వెంటనే మరోచోట ట్రై చేయకుండా నిరాకరణకు గల కారణాన్ని తెలుసుకుని సరిదిద్దుకోవాలి.
4. క్రెడిట్ రిపోర్టు తనిఖీ చేయండి..
మీ క్రెడిట్ రిపోర్టును ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండటం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మీకు తెలియని ఖాతాలు, తప్పుగా నమోదైన పాత బాకీలు, కట్టేసిన లోన్లు ఇంకా యాక్టివ్‌గా చూపించడం వంటి పొరపాట్లు జరగవచ్చు. ఇలాంటి తప్పులు కనిపిస్తే వెంటనే సంబంధిత క్రెడిట్ బ్యూరోకి ఫిర్యాదు (డిస్ప్యూట్) చేసి సరిచేయించుకోవాలి.
5. పాత క్రిడిట్ కార్డు విషయంలో జాగ్రత్త..
మీరు ఎక్కువగా వాడట్లేదని చెప్పి పాత క్రెడిట్ కార్డులను అకస్మాత్తుగా రద్దు చేయకూడదు. మీ క్రెడిట్ హిస్టరీ ఎంత పాతదైతే అంత మంచిది. పాత కార్డును రద్దు చేయడం వల్ల మీ వద్ద ఉన్న మొత్తం క్రెడిట్ లిమిట్ తగ్గిపోతుంది, ఫలితంగా మీ క్రెడిట్ యుటిలైజేషన్ ఒక్కసారిగా పెరిగి స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఇక, ఆరు నెలల వ్యవధిలో సిబిల్ స్కోర్ కచ్చితంగా ఇన్ని పాయింట్లు పెరుగుతుందని నిర్దిష్ట సంఖ్య ఏదీ చెప్పలేం. పాత రిపోర్టుల్లో తీవ్రమైన డిఫాల్ట్‌లు ఉన్నవారికి కోలుకోవడానికి మరింత ఎక్కువ సమయం పడుతుంది. ముఖ్యంగా, డబ్బులు ఇస్తే క్షణాల్లో సిబిల్ స్కోర్ పెంచుతామని గ్యారెంటీ ఇచ్చే ఫేక్ ఏజెన్సీలు, వ్యక్తుల మాటలు నమ్మి మోసపోకండి. క్రెడిట్ స్కోర్ అనేది ఒక క్రమశిక్షణతో కూడిన ఆర్థిక ప్రవర్తన, పరిమిత అప్పులు, క్రమం తప్పకుండా అప్డేట్ అయ్యే సమాచారం ఆధారంగా మాత్రమే పెరుగుతుంది. ఆరు నెలల పాటు ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే మీ క్రెడిట్ ప్రొఫైల్ మెరుగై, హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ సులభంగా పొందే అవకాశం లభిస్తుంది.
తాజావార్తలు
-
CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
-
China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
-
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
ట్రెండింగ్
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!