Site icon NTV Telugu

Flight Tickets: విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? ఈ దేశాల విమాన టికెట్లు రూ.12,000 లోపే!

Airindia

Airindia

ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు విదేశాల్లో పర్యటించి అందమైన జ్ఞాపకాలు కూడగట్టుకోవాలని ఆశపడుతుంటారు. అయితే వేరే దేశానికి వెళ్లాలంటే భారీ బడ్జెట్ అవసరమని మనందరికీ తెలుసు. ఫ్లైట్ టిక్కెట్లకే ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది. అదే డబ్బుతో దేశంలోనే ఏదో ప్రాంతానికి వెళదామని నిర్ణయించుకుంటారు. కానీ.. మీరు ఇప్పుడు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఈ నవంబర్ నెల ప్రయాణానికి చాలా మంచిది.. డబ్బును ఆదా చేస్తుంది. రూ.15,000 కంటే తక్కువ ధరతో విమాన టిక్కెట్లను బుక్ చేసుకోగలిగే దేశాల గురించి చర్చిద్దాం. ఈ ఆఫర్ నవంబర్ నెలకే పరిమితం. కాబట్టి వీలైనంత త్వరగా టిక్కెట్లు బుక్ చేసుకోవడం మంచిది. ఇది కేవలం మనదేశానికి సంబంధించిన విమనాయాన సంస్థలకే వర్తిస్తోంది.

READ MORE: AP Liquor: ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు.. ఇప్పటివరకు ఆదాయం ఎంతంటే?

శ్రీలంక : శ్రీలంక ఓ అందమైన ద్వీప దేశం. ఐరోపా దేశాలతో పోలిస్తే, ఈ దేశం పర్యాటక పరంగా కొంచెం తక్కువ. మీరు నవంబర్‌లో ఇక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. సుమారు రూ. 11,000 చెల్లించి దేశీయ విమాన టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు.

నేపాల్ : భారతదేశం యొక్క పొరుగు దేశం నేపాల్. అందమైన, ప్రశాంతమైన దేశం. మీరు నవంబర్ నెలలో ఇక్కడికి రావాలని ప్లాన్ చేస్తుంటే.. సుమారు రూ. 8,000కి విమాన టికెట్ పొందవచ్చు.

వియత్నాం : చౌకగా ప్రయాణించగల దేశాలలో వియత్నాం కూడా ఒకటి. మీరు ఇక్కడికి రావాలని ఆలోచిస్తున్నట్లయితే.. విమాన టిక్కెట్టు ధర దాదాపు రూ. 9,000 ఖర్చవుతుంది.

సింగపూర్: సింగపూర్ ఓ ధనిక దేశం. ఈ దేశానికి వెళ్లేందుకు దేశీయ విమాన టిక్కెట్టును సుమారు రూ. 10,000తో బుక్ చేసుకోవచ్చు.

దుబాయ్ యూఏఈ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా దుబాయ్‌లో ఉంది. దీన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. యూఏఈలోని దుబాయ్ నగరానికి రావాలంటే దాదాపు రూ.10,000 వెచ్చించాల్సి ఉంటుంది.

READ MORE:US: హమాస్ చీఫ్ సిన్వార్ హతంపై అమెరికా కీలక ప్రకటన

Exit mobile version