భారతీయ ఉద్యోగులు లక్ష్యంగా కాంప్‌బెల్ ఐటీ ఎగ్జిక్యూటివ్ మార్టిన్ బల్లి జాత్యహంకార దూషణకు పాల్పడ్డాడు. భారతీయ ఉద్యోగులు మూర్ఖులు అంటూ అనవసరంగా నోరుపారేసుకున్నాడు. కాంప్‌బెల్ కంపెనీ ఉత్పత్తులను అవమానించడమే కాకుండా భారతీయ సహోద్యోగులపై జాత్యహంకార వ్యాఖ్యలకు సంబంధించిన రికార్డింగ్‌లు బయటపడ్డాయి. దీంతో కంపెనీ సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో సీనియర్ ఐటీ ఎగ్జిక్యూటివ్ మార్టిన్ బల్లిని ఉద్యోగం నుంచి తొలగించింది.
ఇది కూడా చదవండి: Supreme Court: ఆధార్ కార్డుంటే ఓటు వచ్చేస్తుందా? చొరబాటుదారులపై సుప్రీంకోర్టు ఆందోళన
కంపెనీ ఉత్పత్తులను విమర్శించడమే కాకుండా.. జాత్యహంకార వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో అమెరికన్ ఐటీ ఎగ్జిక్యూటివ్ మార్టిన్ బల్లిని కాంప్‌బెల్స్ కో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్ తొలగించారు.
ఇది కూడా చదవండి: Supreme Court: ఢిల్లీ కాలుష్యంపై జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు
నవంబర్ 20న మిచిగాన్‌లోని వేన్ కౌంటీ సర్క్యూట్ కోర్టులో మాజీ ఉద్యోగి రాబర్ట్ గార్జా పిటిషన్ దాఖలు చేశాడు. క్యాంప్‌బెల్ ఉత్పత్తులు పేద ప్రజలకు అత్యంత ప్రాసెస్ చేయబడే ఆహారం అని.. అంతేకాకుండా భారతీయ సహోద్యోగులను ‘ఇడియట్స్’ అంటూ మార్టిన్ బల్లి పిలిచాడు అంటూ పిటిషన్‌లో పేర్కొన్నాడు. 2024 నవంబర్‌లో జీతం చర్చ సందర్భంగా బల్లి ఈ వ్యాఖ్యలు చేశాడు. మార్టిన్ బల్లి వ్యాఖ్యలను రాబర్ట్ గార్జా రికార్డ్ చేశాడు. అయితే ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు బయటకు రావడంతో కంపెనీ సీరియస్ అయింది. ఇలాంటి భాషను ఏ మాత్రం సహించబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మార్టిన్ బల్లిని ఉద్యోగం నుంచి తొలగించింది. కార్పొరేట్ విలువలు, కార్యాలయ గౌరవాన్ని నిలబెట్టడానికి.. తమ నిబద్ధతను రుజువు చేసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.