Buy a car on Amazon: ఆన్‌లైన్ షాపింగ్ ఫ్లాట్‌ఫాం అమెజాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి ఫ్యాషన్, హోం యుటిలిటీ ఇలా అన్ని రకాల వస్తువులు దొరుకుతుంటాయి. భారతదేశంలో ఆన్‌లైన్ షాపింగ్‌కి జనాలు కూడా బాగానే అలవాటయ్యారు. ఇదిలా ఉంటే కార్లను ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫారంలో కొనుగోలు చేసే రోజు దూరంలో లేదు, ఇది త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది.