PM Mudra Yojana: ఈ రోజుల్లో పైసా గ్యారెంటీ లేకుండా సొంత వాళ్లే రూపాయి కూడా ఇవ్వడం లేదు. అలాంటిది ఎలాంటి గ్యారెంటీ, షురిటీ లేకుండా రూ.20 లక్షల వరకు రుణం ఇస్తున్న విషయం మీకు తెలుసా.. ఇది నిజంగా నిజమైన వార్త. ఈ రుణానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో, ఇంతకీ ఈ రుణం ఇచ్చేది ఎవరో మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: NABARD Recruitment 2026: నాబార్డ్‌లో డెవలప్మెంట్ అసిస్టెంట్ జాబ్స్.. గ్రాడ్యుయేట్స్ కి మంచి ఛాన్స్
కేంద్ర ప్రభుత్వం యువతకు, వ్యాపారం ప్రారంభించడానికి ఆసక్తి ఉన్నవారికి సహాయం చేస్తోంది. ఎవరైనా వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి రూ.20 లక్షల వరకు రుణాలను అందిస్తోంది. ఈ రుణానికి ఎటువంటి హామీ అవసరం లేదు. ఇది పూర్తిగా పూచీకత్తు లేని రుణం. నిజానికి కేంద్రం అమలు చేస్తున్న ఈ ప్రభుత్వ పథకం గతంలో రూ.10 లక్షల వరకు మాత్రమే రుణాలను అందించింది. కానీ ఇప్పుడు ఈ పథకంలో భాగంగా రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. FY2024-25 బడ్జెట్ ప్రసంగం సందర్భంగా.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రుణ పరిమితిని రూ.20 లక్షలకు రెట్టింపు చేసినట్లు వెల్లడించారు. ఇంతకీ ఈ ప్రభుత్వ పథకం పేరు ఏంటో తెలుసా.. ప్రధాన్ మంత్రి ముద్ర యోజన (PMMY). ఈ ప్రభుత్వ పథకం నాలుగు కేటగిరిల్లో వ్యాపారాలకు రుణాలు అందిస్తుంది. తద్వారా వారు కాలక్రమేణా తమ వ్యాపారాలను విస్తరించుకోవచ్చు. శిశు కేటగిరీ కింద రూ.50,000 రుణం, కిషోర్ కేటగిరీ కింద రూ.50,000 నుంచి రూ.5లక్షల వరకు, తరుణ్ కేటగిరీ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు, తరుణ్ ప్లస్ కింద రూ.10 నుంచి 20 లక్షల వరకు రుణం అందజేస్తారు.
ప్రధానమంత్రి ముద్ర యోజనను మోడీ ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఇది ప్రత్యేకంగా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారి కోసం రూపొందించినది. 8వ తరగతి ఉత్తీర్ణులైనా, ఏ భారతీయ పౌరుడైనా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి దరఖాస్తు చేసుకోడానికి ఎటువంటి విద్యా అర్హతలు అవసరం లేదు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోడానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, వ్యాపార ప్రణాళిక, KYC పత్రం, ఆదాయ రుజువు కలిగి ఉండటం అవసరం. దరఖాస్తు చేసుకోడానికి ఆసక్తి గల వారు https://www.mudra.org.in/ లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మీరు బ్యాంకుల ద్వారా కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
READ ALSO: Karumuru Venkat Reddy: నువ్వుమైనా సుప్పిని శుద్దపూసవా.. రాధాకృష్ణ రాతలపై కారుమూరు సీరియస్..!