Site icon NTV Telugu

Business Flash 19-07-22: ఐటీ కంపెనీల రెవెన్యూలో 62 శాతం శాలరీలకే

Business Flash

Business Flash

Business Flash 19-07-22: ఓలా ఎలక్ట్రిక్‌ 4 వేల కోట్ల పెట్టుబడి

బెంగళూరుకు చెందిన సెల్‌ ‘ఆర్ అండ్‌ డీ’ ఫెసిలిటీలో ఓలా ఎలక్ట్రిక్‌ 4000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద బ్యాటరీ కేంద్రాల్లో ఒకటిగా నిలవనుంది. ఇక్కడ అత్యంత అధునాతన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటికోసం 165కి పైగా విశిష్ట ప్రయోగశాల పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. బ్యాటరీలకు సంబంధించిన అన్ని అంశాలకూ దీన్ని కేరాఫ్‌ అడ్రస్‌లా ఏర్పాటుచేయనున్నారు.

ఐటీ సంస్థల 62 శాతం రెవెన్యూ శాలరీలకే

మన దేశంలోని ఐటీ కంపెనీల రెవెన్యూ గత ఐదేళ్లలో రెట్టింపైంది. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో తదితర పెద్ద కంపెనీలు వేతనాలను భారీగా, స్థిరంగా చెల్లిస్తున్నాయి. చిన్న సంస్థలు కూడా ట్యాలెంట్‌ ఉన్న స్టాఫ్‌ పైన ఫోకస్‌ పెడుతున్నాయి. సీనియర్‌ ఉద్యోగులు కంపెనీని వీడి వెళ్లిపోకుండా ఆపేందుకు, కొత్తోళ్ల నియామకానికి ఐటీ సంస్థలు తాపత్రయపడుతున్నాయి. దీంతో గత ఐదేళ్లలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలను అంటే 62 శాతం రెవెన్యూని శాలరీలకే కేటాయించాయి.

స్టాక్‌ మార్కెట్‌ అప్‌డేట్‌

స్టాక్‌ మార్కెట్ల ట్రేడింగ్‌ ఊగిసలాటలో సాగుతోంది. సెన్సెక్స్‌ నామమాత్రంగా 100 పాయింట్లు మాత్రమే పెరిగింది. ఇది గత కొన్ని రోజుల కనిష్టం కావటం గమనార్హం. నిఫ్టీ 16,300 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మెటల్‌, ఆటోమొబైల్‌, పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు, టెలికం సంస్థల షేర్లకు అమ్మకాల సెగ తగిలింది. మరో వైపు.. టీవీఎస్‌, ఐషర్‌ కంపెనీల షేర్ల వ్యాల్యూ 52 వారాల గరిష్టానికి చేరింది.

read more:Business Headlines 19-07-22: పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన రిటైల్‌ సేల్స్‌..

Exit mobile version