Karnataka Crime: అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్య తన భర్తకు తినే అన్నంలో విషం పెట్టి చంపింది. తర్వాత ఏం తెలియనట్లు నటిస్తూ పులి దాడిలో ఆయన చనిపోయినట్లు తప్పుడు కేసు పెట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లాలో శుక్రవారం వెలుగు చూసింది. హున్సురు తాలూకాలోని చిక్కహెజ్జూర్ గ్రామానికి చెందిన వెంకటస్వామి(45), సల్లపురి భార్యాభర్తలు. వీళ్లు అరెకా గింజల తోటల్లో కూలీలుగా పనిచేస్తున్నారు.
READ ALSO: Sajjala Ramakrishna Reddy: అమరావతి రాజధానిపై సజ్జల కీలక వ్యాఖ్యలు.. మా విధానం అదే..!
ఏం జరిగిందంటే..
ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. హెజ్జూర్ గ్రామంలో సోమవారం ఒక పులి కనిపించింది. ఈక్రమంలో భార్య సల్లపురిగా పులి సంచరిస్తున్నట్లు వచ్చిన పుకార్లను ఆసరాగా చేసుకుని తన భర్తను చంపడానికి కుట్ర పన్నింది. అడవి జంతువుల దాడుల వల్ల సంభవించే మరణాలకు ప్రభుత్వం అందించే భారీ పరిహారం పొందడానికి ఆ మహిళ తన భర్తకు విషం ఇచ్చి చంపిందని విచారణలో వెలుగు చూసిందన్నారు. అనంతరం తమ విచారణలో భర్తను చంపినట్లు ఒప్పుకుందని పోలీసు తేలిపారు.
ముందుగా ఆమె తన భర్తను చంపి, ఆయన తప్పిపోయాడని, ఆ పులి తన భర్తను చంపి మృతదేహాన్ని గుర్తుతెలియని ప్రదేశానికి ఈడ్చుకెళ్లి ఉండవచ్చని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వెంకటస్వామి మృతదేహాన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులతో కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఎంత వెతికిన బయట భర్త ఆచూకీ లభించకపోవడంతో వాళ్ల ఇంటి పరిసరాల్లో కూడా వెతికారు. అప్పుడు ఇంటి వెనుక ఉన్న ఆవు పేడ కుప్పలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం భార్యను విచారించగా, ఆమె హత్య చేసినట్లు అంగీకరించిందని తెలిపారు. అడవి జంతువుల దాడుల వల్ల సంభవించే మరణాలకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ. 15 లక్షల పరిహారం అందిస్తుందని విని, హత్యకు ప్లాన్ చేసినట్లు ఆమె అంగీకరించిందని పేర్కొన్నారు. సంఘటనపై హుణసురు రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
READ ALSO: Health Tips: అలర్ట్.. కప్పు చాయ్‌తో గుప్పెడు గుండెకు ప్రమాదం..