ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ యోహాన్ పూనావాలా, భార్య మిచెల్‌లో ముంబైలో ఖరీదైన భవంతిని కొనుగోలు చేశారు. దక్షిణ ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో రూ.500 కోట్లకు 30,000 చదరపు అడుగుల విస్తీరణంలో స్వతంత్ర ఆస్తిని కొనుగోలు చేశారు. ఇటీవల కాలంలో అత్యంత ఖరీదైన నివాసం ఇదే కావడం విశేషం. దీనికి ‘పూనావాలా మాన్షన్’ అని నామకరణం చేశారు.