Bill gates: బిల్గేట్స్ సూచించిన 5 అద్భుత పుస్తకాలు.. చదివేయండి మరీ!
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా సుదీర్ఘ కాలం మొదటి స్థానంలో కొనసాగాడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఆయన కొత్త దిశను చూపడమే కాకుండా ఐటీతో ప్రపంచ గమనాన్నే మార్చేశాడు. వ్యాపార వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా పుస్తకాలు చదివే అలవాటును బిల్గేట్స్ మానుకోలేదు. రెగ్యులర్గా రకరకాల పుస్తకాలను ఆయన చదువుతూనే ఉంటారు. అందులో బాగా నచ్చినవి, ఆ పుస్తకాలు చదివితే ప్రయోజనం చేకూరుతుందని నమ్మేవాటిని మనకు సూచిస్తుంటారు. తాజాగా మరికొన్ని పుస్తకాలను ఆయన మనకు సూచించారు. వాటిని చదవడం ఎంతో మంచిదంటున్నారు. ఆ పుస్తకాలు ఏంటో.. వాటిన చదవడం వల్ల మనకు కలిగే లాభాలను కూడా ఆయన వివరించారు. అవేంటో చూద్దాం.
- “ది పవర్” పుస్తకాన్ని బ్రిటీష్ రచయిత నయోమీ అల్డర్మ్యాన్ రాశారు. ఈ నవల ఫిక్షన్ విభాగంలో 2017లో రిలీజైన ఈ పుస్తకం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ పుస్తకం చదవాలంటూ గేట్స్కి ఆయన కూతురు సూచించారట. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, పైకి కనిపించని ఇబ్బందులు తదితర అంశాలను ఇందులో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు.
- అమెరికన్ జర్నలిస్టు రాసిన మరో పుస్తకం “వై వీ ఆర్ పోలరైజ్డ్”. అమెరికా రాజకీయాలు ప్రధాన ఇతివృత్తంగా ఉండే ఈ ఫిక్షన్ నవల సైకాలజీ మీద కూడా ఫోకస్ చేస్తుంది.
- అమోర్ టవెల్స్ రాసిన “ది లింకన్ హైవే” పుస్తకం కూడా చదవాల్సిందేనని బిల్గేట్స్ సూచించారు. గతంలో అమోర్ టవెల్స్ రాసిన ‘ఏ జెంటిల్మెన్ ఇన్ మాస్కో’కి కొనసాగింపుగా ఈ పుస్తకం వచ్చింది. మొదటిదాని కంటే ఈ పుస్తకం చాలా బాగుందంటూ గేట్స్ కితాబిచ్చారు.
- కిమ్ స్టాన్లీ రాబిన్సన్ రాసిన సైన్స్ ఫిక్షన్ నవల “ది మినిస్ట్రీ ఫర్ ది ఫ్యూచర్”. వాతావరణ మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రస్తుతం నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్ ఎలా ఉంటుందనే అంశాలను ఈ పుస్తకంలో లోతుగా వివరించిన పుస్తకం ఇది. ప్రకృతి పట్ల మన బాధ్యతను ఈ పుస్తకం గుర్తు చేస్తుందంటూ గేట్స్ తెలిపారు.
- ప్రముఖ రచయిత వాక్లవ్ స్మిల్ రాసిన మరో మాస్టర్ పీస్ “హౌ ది వరల్డ్ రియల్లీ వర్క్స్”. జీవితానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలు మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయని.. వాటి ఆధారంగానే మన జీవనశైలి ఏలా మారుతుందనే అంశాలను ఇందులో విపులంగా చర్చించారు.
Also Read
- Gold - Silver Prices: రూ. 8 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత పతనం అయ్యిందంటే!
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
- Real Estate Boom: రియల్ ఎస్టేట్కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..