మార్కప్ ఛార్జీల పేరిట రూ.9,700 కోట్లు కొల్లగొట్టిన బ్యాంకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిడెన్ ఛార్జీల పేరుతో బ్యాంకులు కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నాయి. ఉద్యోగాల కోసం, ఉన్నత చదువుల కోసం, వైద్యం కోసం, తమ బంధువుల కోసం, సొంత పర్యటనల చాలా మంది భారతీయులు విదేశాలకు వెళ్తుంటారు. ఆయా దేశాల్లో మన కరెన్సీ చెల్లదు కాబట్టి మన డబ్బును ఇచ్చి ఆయా దేశాల కరెన్సీని తీసుకుంటారు. ఇలా డబ్బును బదిలీ చేసే వారిపై ప్రాసెసింగ్ ఫీజు, మార్కప్ ఫీజుల పేరుతో బ్యాంకులు హిడెన్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయంటూ క్యాపిటల్ ఎకానమిక్స్ అనే సంస్థ బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలో ఒక్క 2021 సంవత్సరంలోనే విదేశాలకు వెళ్లే భారతీయులు దాదాపు రూ.95వేల కోట్లు (1270 కోట్ల డాలర్లు) ట్రాన్స్‌ఫర్ చేశారు. సదరు డబ్బులో 380 కోట్ల డాలర్లను ఉన్నత విద్య కోసం పంపగా.. పర్యటనల కోసం 320 కోట్ల డాలర్లు, ఫ్యామిలీ సపోర్ట్ కోసం 270 కోట్ల డాలర్లను భారతీయులు పంపారు.
Read Also: వంట గ్యాస్ ధరల మంట.. మరో రూ.100 పెరిగే అవకాశం
Also Read
అయితే గతంలో భారతీయులు పంపే డబ్బులపై బ్యాంకులు అధికంగా ఛార్జీలు వసూలు చేసేవి. అయితే గత ఐదేళ్లుగా ఆ ఛార్జీలు తగ్గించి కేవలం ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే వసూలు చేస్తున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి. దీంతో 2016లో ప్రాసెసింగ్ ఫీజుల కింద బ్యాంకులు రూ.15,017 కోట్లు ఆర్జిస్తే.. 2019లో రూ.12,142 కోట్లు మాత్రమే ఆర్జించాయి. దీంతో ఆ లోటును పూడ్చుకునేందుకు బ్యాంకులు ఎక్స్ఛేంజ్ మార్కప్ పేరుతో ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఛార్జీలను బ్యాంకులు భారీగా పెంచేశాయి. వాటి ద్వారా 2016లో బ్యాంకులకు రూ.2,505 కోట్లు రాగా 2019లో రూ.4,422 కోట్లు సమకూరాయి. 2020లో అయితే ఏకంగా రూ.9,700 కోట్లను బ్యాంకులు కొల్లగొట్టాయి. విదేశాలకు భారతీయులు పంపిన డబ్బులో ప్రాసెసింగ్ ఫీజు ద్వారా బ్యాంకులు రూ.26,300 కోట్లు సంపాదించాయి. ఇందులో మార్కప్ ఛార్జీల వాటా 36 శాతంగా ఉంది. ఈ ఛార్జీల గురించి చాలా మంది వినియోగదారులకు తెలియదు. బ్యాంకులు వసూలు చేస్తున్న ఈ ఛార్జీల దోపిడీ వల్ల ఎక్కువ నష్టపోతున్న వారిలో గల్ఫ్ దేశాలకు చెందిన కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!