Bank of America: అంబానీ కంపెనీపై అమెరికా బ్యాంక్ కన్ను.. రూ.18,268 కోట్ల భారీ డీల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank of America: ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, అమెరికా దిగ్గజ బ్యాంక్ ఆఫ్ అమెరికా కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన జియో క్రెడిట్ లిమిటెడ్‌లో 49.9 శాతం వరకు వాటాను సుమారు రూ.18,268 కోట్లకు కొనుగోలు చేసేందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా అంగీకరించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. బ్యాంక్ ఆఫ్ అమెరికా అనుబంధ సంస్థ ఎన్బీ హోల్డింగ్స్ ద్వారా ఈ పెట్టుబడి పెట్టనుంది. ముందుగా ప్రిఫరెన్షియల్ షేర్ కేటాయింపు ద్వారా రూ.6,613 కోట్ల పెట్టుబడితో 4.29 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనుంది. దీంతో జియో క్రెడిట్లో 26.50 శాతం వాటా లభిస్తుంది. అనంతరం రూ.11,655 కోట్ల విలువైన 7.56 కోట్ల వారెంట్లను ఎన్బీ హోల్డింగ్స్ సబ్‌స్క్రైబ్ చేయనుంది. ఈ వారెంట్లను 18 నెలల్లోపు ఈక్విటీ షేర్లుగా మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జియో క్రెడిట్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా వాటా 49.90 శాతానికి చేరుతుంది.
రెండేళ్లలోనే రూ.30,667 కోట్ల ఆస్తులు
జియో క్రెడిట్‌ను సుమారు రెండేళ్ల క్రితమే స్టార్ట్ చేశారు. దీని ద్వారా చిన్న వ్యాపారాలు, రిటైల్ కస్టమర్లకు రుణాలు అందించడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ కంపెనీ ద్వారా గృహ రుణాలను కూడా అందిస్తున్నారు. 2026 జూన్ 30 నాటికి కంపెనీ నిర్వహణలోని ఆస్తులు (AUM) రూ.30,667 కోట్లకు చేరుకున్నాయి. అయితే వ్యక్తిగత రుణాలు, ఎలాంటి హామీ లేకుండా ఇచ్చే రుణాల రంగంలోకి జియో క్రెడిట్ ఇంకా ప్రవేశించలేదు. ఈ రంగాలను గతంలో కీలక లక్ష్యాలుగా పరిగణించినప్పటికీ, ప్రస్తుతం కంపెనీ ఇతర రుణ విభాగాలపై దృష్టి సారిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచ స్థాయి సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్న జియో వ్యూహానికి తాజాగా ఒప్పందం మరింత బలం చేకూర్చనుందని అంటున్నారు. ఇప్పటికే బీమా రంగంలో జర్మనీకి చెందిన అలియాంజ్‌తో, మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలో అమెరికాకు చెందిన బ్లాక్‌రాక్‌తో జియో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకుంది. ఈ జాయింట్ వెంచర్ ద్వారా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు ఉన్న డిజిటల్ సామర్థ్యాలు, భారత మార్కెట్‌పై అవగాహనతో పాటు బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రపంచవ్యాప్త ఆర్థిక సేవల నైపుణ్యం తోడు కానుంది. అయితే ఇది బ్యాంక్ ఆఫ్ అమెరికా భారత రిటైల్ రుణ వ్యాపారంలోకి నేరుగా ప్రవేశిస్తున్నట్లు భావించకూడదని సంస్థ అధికారులు స్పష్టం చేశారు.
Also Read
- Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
భారత్‌పై BofA భారీ నమ్మకం
ఈ ఒప్పందంపై ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. భారతదేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే విస్తృతమైన, విశ్వసనీయమైన, అందరికీ అందుబాటులో ఉండే ఆర్థిక వ్యవస్థ అవసరమన్నారు. టెక్నాలజీ, ప్రపంచ స్థాయి నైపుణ్యాల సహాయంతో భారతీయులకు రుణ సేవలను మరింత సింపుల్‌గా, పారదర్శకంగా అందించడంలో ఈ ఒప్పదం కీలక ముందడుగని పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా సీఈఓ బ్రయాన్ మోయ్నిహాన్ మాట్లాడుతూ.. భారత్ ప్రపంచంలో అత్యంత కీలకమైన వృద్ధి మార్కెట్లలో ఒకటని అన్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తక్కువ సమయంలోనే గణనీయమైన స్థాయికి చేరుకుందని, రెండు కంపెనీల బలాలు కలిస్తే ఆర్థిక సేవల వినియోగం మరింత విస్తరించడంతో పాటు భారత ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని తెలిపారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?