NTV Telugu Site icon

Amazon: ఇకపై అమెజాన్ నుంచి డ్యామేజుడ్ ప్రోడక్ట్స్ డెలివరీలు ఉండవు..అంతా ఏఐ పుణ్యమే..

Amazon

Amazon

Amazon: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ త్వరలో పూర్తిగా ఆటోమేషన్ మోడ్ లోకి మారిపోతోంది. ఇకపై అమెజాన్ నుంచి డ్యామేజుడ్ ప్రోడక్ట్స్ డెలివరీ, షిప్పింగ్ జరగకుండా AI సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇకపై పాడైన, దెబ్బతిన్న వస్తువులను పంపకుండా చర్యలు తీసుకుంటుంది. మనం తరుచుగా ఇంతకుముందు అమెజాన్ నుంచి డ్యామేజుడ్ ప్రోడక్ట్స్ రావడాన్ని చూశాం. అయితే ఇకపై అలా తప్పులు జరపకుండా ఏఐ టెక్నాలజీని వాడుకోనుంది అమెజాన్.

Read Also: AI Technology: ఉద్యోగాలకు ఎసరు పెడుతున్న ఏఐ టెక్నాలజీ.. మే నెలలో 4000 జాబ్స్ ఊస్ట్..

అమెజాన్ వేర్ హౌజుల్లో కృత్రిమ మేధస్సు (AI)ని ఉపయోగిస్తున్నారు. వస్తువులను రవాణా చేసే ముందు తనిఖీ చేయడానికి ఏఐని ఉపయోగించి తక్కువ సమయంలో ప్యాకింగ్, ఆర్డర్ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అమెజాన్ గిడ్డంగులను మరింతగా ఆటోమేషన్‌ తో నింపేయనుంది. సాధారణంగా వేర్ హౌజుల్లో కార్మికులు ఏదైనా ప్రోడక్ట్స్ ను క్షణ్ణంగా పరిశీలించి షిప్పింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో పని ఒత్తడి వల్ల చిన్నచిన్న డ్యామేజ్ వస్తువులను డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భాలు రాకుండా ఏఐ టెక్నాలజీని వాడాలని అనుకుంటున్నారు. దీనివల్ల కార్మికులపై ఒత్తిడి తగ్గనుంది.

కస్టమర్లకు పాడైన వస్తువులను తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఏఐని అమెజాన్ ఇంట్రడ్యూస్ చేసింది. ఒక వేళ కస్టమర్లకు పాడైన వస్తువులను పంపిస్తే ఇది వారిని తీవ్ర నిరాశకకు గురిచేయడంతో పాటు బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ గా మిగులుతుంది. దీని కోసమే ప్రస్తుతం అమెరికాలోని రెండు వేర్ హౌజుల్లో ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. ఉత్తర అమెరికా, యూరప్ లోని మరో 10 ప్రాంతాలకు దీన్ని విస్తరించాలని చూస్తున్నారు. అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మేనేజర్ క్రిస్టోఫ్ స్క్వెర్డ్‌ఫెగర్ ప్రకారం, దెబ్బతిన్న వస్తువులను గుర్తించడంలో AI వ్యవస్థ మానవ కార్మికుడి కంటే మూడు రెట్లు మెరుగైనదని పేర్కొన్నారు. AIకి శిక్షణ ఇవ్వడానికి, అమెజాన్ పాడైపోని, దెబ్బతిన్న వస్తువులను చూపించే చిత్రాలను ఉపయోగించారు. ఈ చిత్రాలను పోల్చడం ద్వారా, AI వ్యవస్థ లోపాలను గుర్తించి సరైన వస్తువును ఎంచుకోగలదు.