Amazon Layoffs 2025: షాకింగ్ న్యూస్.. అమెజాన్‌లో భారీగా ఉద్యోగాల కోతలు.. ఏకంగా 30 వేలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon Layoffs 2025: ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదికల ప్రకారం, ఈసారి సుమారు 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను లేఆఫ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇది అమెజాన్ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల కోతగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో దాదాపు 3.5 లక్షల కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సుమారు 10 శాతం మందిని తొలగించేందుకు నిర్ణయించిందని సమాచారం. మొత్తం కంపెనీ ఉద్యోగుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 15.5 లక్షలుగా ఉంది. కరోనా అనంతరం వ్యాపార విస్తరణతో పెరిగిన ఖర్చులను తగ్గించుకోవడమే ఈ లేఆఫ్స్ వెనుక ప్రధాన కారణంగా తెలుస్తోంది.
READ MORE: Central Cabinet Decisions: బీహార్ ఎన్నికల వేళ అన్నదాతలకు కేంద్రం శుభవార్త
Also Read
- CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
- ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
గత రెండేళ్లుగా అమెజాన్ పరికరాలు, కమ్యూనికేషన్లు, పాడ్‌కాస్టింగ్, ఇతర చిన్న విభాగాల్లో ఉద్యోగులను తగ్గిస్తూ వస్తోంది. ఈసారి మాత్రం మానవ వనరులు, డివైసెస్ అండ్ సర్వీసెస్, ఆపరేషన్స్ వంటి విభాగాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని సమాచారం. హెచ్ఆర్ విభాగంలోనే దాదాపు 15 శాతం ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన నోటీసులు వచ్చే వారం నుంచి ఈమెయిల్ ద్వారా పంపనున్నారు. దీనికి సంబంధించి ప్రభావితమయ్యే విభాగాల మేనేజర్లకు అమెజాన్ ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చిందని సమాచారం. ప్రధాన కార్యాలయం ఉన్న మిన్నియాపాలిస్లో ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
READ MORE: Cyclone Montha: పెను తుఫాన్‌గా మారిన మొంథా..
అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ, సంస్థలో అధిక బ్యూరోక్రసీని తగ్గించడమే కాకుండా నిర్వహణ స్థాయిలను కుదించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు. సంస్థలోని పునరావృత పనులను ఆటోమేట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నారు. జూన్‌లో జాస్సీ మాట్లాడుతూ.. ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యోగుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
2022 చివరిలో అమెజాన్ సుమారు 27,000 మందిని తొలగించింది. అప్పటి నుంచి లేఆఫ్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. ఈసారి 30,000 మందిని తొలగించడం ద్వారా కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్‌గా నిలవనుంది. లేఆఫ్స్.ఎఫ్‌వైఐ వెబ్సైట్ ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 216 కంపెనీలు దాదాపు 98,000 మంది ఉద్యోగులను తొలగించాయి. 2024లో ఈ సంఖ్య 1.53 లక్షలకు చేరింది. అమెజాన్‌తో పాటు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ఫోసిస్ వంటి ప్రధాన కంపెనీలు కూడా ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. అమెజాన్ ఆర్థిక వ్యూహం నిరంతరం మారుతున్న నేపథ్యంలో, చివరి దశలో తొలగించే ఉద్యోగుల సంఖ్యలో మార్పులు ఉండే అవకాశముందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది.
తాజావార్తలు
-
RCB vs SRH: ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. మ్యాచ్ ఓడినా టేబుల్ టాపర్‌గా నిలిచిన పాటిదార్ సేన..
-
Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
-
Motorola Edge 70 Pro+: మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ త్వరలో భారత్ లో విడుదల.. 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 16GB RAM
-
CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
-
US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్‌లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!