Amazon layoffs: ప్రపంచవ్యాప్తంగా టెక్ లేఆఫ్స్ జరుగుతున్నాయి. ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందనే భయం టెక్కీలో నెలకొంది. ఇప్పటికే టాప్ టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇటీవల అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఈ సంఖ్య 30,000 వరకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల, అమెజాన్ తన ఉద్యోగులకు తెల్లవారుజామున టెక్స్ట్ మెసేజులు చేసి, ఉద్యోగంలో నుంచి పీకేస్తున్నట్లు తెలియజేసింది.
Amazon Layoffs 2025: ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదికల ప్రకారం, ఈసారి సుమారు 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను లేఆఫ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇది అమెజాన్ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల కోతగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో దాదాపు 3.5 లక్షల కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సుమారు 10 శాతం మందిని తొలగించేందుకు నిర్ణయించిందని…
ట్విట్టర్, ఫేస్‌బుక్, మరికొన్ని ఐటీ దిగ్గజ సంస్థలు కూడా తమ ఉద్యోగులను తగ్గించుకునేపనిలో పడిపోయాయి.. ట్విట్టర్‌ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత.. చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి.. ఐటీ సెక్టార్‌లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకు కోత తప్పదనే వార్తలు కూడా కలవరపెడుతున్నాయి.. మరోవైపు.. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా అదేబాటపట్టినట్టుగా తెలుస్తోంది.. ఏకంగా 10,000 మంది ఉద్యోగాలకు ఎసరు వచ్చేలా కనిపిస్తోంది.. కార్పొరేట్, టెక్నాలజీ విభాగంలోని ఉద్యోగులను ఈ వారం నుంచే తొలగించేందుకు అమెజాన్…