Site icon NTV Telugu

Airtel: యూజర్లకు ఎయిర్‌టెల్ షాక్.. ఆ చౌకైన ప్లాన్ తొలగింపు!

Airtel

Airtel

Airtel: టెలికాం రంగంలో మరో భారీ మార్పు జరిగింది. జియో 1 జీబీ డేటా ప్లాన్‌ను ఆపేసిన కొద్దిసేపటికే, ఎయిర్‌టెల్ కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తూ.. వినియోగదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఇక, రూ.249 ఎంట్రీ లెవల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఆగస్టు 20వ తేదీ నుంచి ఈ ప్లాన్‌ కస్టమర్లకు అందుబాటులో ఉండదని పేర్కొనింది. ఇక, వొడాఫోన్‌ ఐడియా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.

Read Also: Hyderabad Couple Caught Smuggling Ganja: ఇలాంటి వారిని పట్టుకోవడం ఇదే ఫస్ట్ టైమ్..

కాగా, ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ రూ.249 ప్యాక్‌లో 24 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 1 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్‌ అందిజేస్తోంది. కానీ, ఈ ప్లాన్ రద్దైన తర్వాత, యూజర్లు కనీసం రూ.319 రీఛార్జ్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కొత్త ప్యాక్‌ నెల రోజుల వ్యాలిడిటీతో కొనసాగుతుంది. కాగా, వొడాఫోన్‌ ఐడియా మాత్రం రూ.299కు రోజుకు 1 జీబీ డేటా ప్లాన్‌ అందజేస్తుంది. అయితే, రిలయన్స్ జియో విషయాని వస్తే, ప్రస్తుతం జియో వెబ్‌సైట్‌లో రూ.299 (1.5 జీబీ/డే – 28 రోజులు) బేస్ ఆప్షన్‌గా తీసుకు రాగా, రూ.349 (2 జీబీ/డే – 28 రోజులు) ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉంచింది.

Read Also: Hyd Girl Death Update: బిల్డింగ్‌లో ఉన్న వారే హత్య చేశారా?.. ఇప్పటికీ వీడని మిస్టరీ

అయితే, టెలికాం సంస్థలు ARPU (Average Revenue Per User) పెంచుకోవడం కోసమే ఈ ప్లాన్స్ రద్దు చేసినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎంట్రీ లెవల్‌ ప్లాన్లు తొలగించడంతో కస్టమర్లు అధిక డేటా ప్లాన్లకు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం జియో యూజర్లలో 20-25 శాతం మంది, ఎయిర్‌టెల్ యూజర్లలో 18-20 శాతం మంది ఎంట్రీ లెవల్‌ 1 జీబీ ప్లాన్‌ను ఉపయోగిస్తున్నారని అంచనా. ఈ మార్పులతో కంపెనీల ఆదాయం 4-7 శాతం పెరిగుతాయి.. సగటు ఆదాయం (ARPU) రూ.10-13 మేర పెరిగే ఛాన్స్ ఉందని బ్రోకరేజీ సంస్థలు పేర్కొంటున్నాయి.

Exit mobile version