Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Bigg Boss Telugu Who Is Title Winner Of Bigboss 5 Telugu Season

బిగ్‌బాస్‌-5లో టాప్-5 కంటెస్టెంట్లు వీళ్లే.. టైటిల్ విజేత అతడేనా?

Published Date :December 13, 2021 , 9:20 am
By Ramesh Nalam
బిగ్‌బాస్‌-5లో టాప్-5 కంటెస్టెంట్లు వీళ్లే.. టైటిల్ విజేత అతడేనా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

బిగ్‌బాస్-5 తెలుగు సీజన్ ఫైనల్ వీక్‌కు చేరుకుంది. టాప్-5 కంటెస్టెంట్లు ఎవరో ఆదివారం ఎపిసోడ్‌లో స్పష్టమైంది. కాజల్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో టాప్-5లో సన్నీ, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, మానస్ ఉన్నారు. వీరిలో బిగ్‌బాస్ విజేతగా ఎవరు నిలుస్తారో ఈ వారం తేలిపోనుంది. ఎక్కువ శాతం సన్నీ గెలిచే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే యూట్యూబర్ షణ్ముఖ్‌కు ఫాలోయింగ్ బాగా ఉండటం.. బయట అతడి స్నేహితురాలు దీప్తి సునయన పెయిడ్ ఓట్లు వేయిస్తుందని ప్రచారం జరుగుతుండటంతో షణ్ముఖ్ టైటిల్ గెలిచే అవకాశాలను కొట్టిపారేయలేం. టైటిల్ ఎవరు గెలుచుకున్నా రూ.50 లక్షల ప్రైజ్ మనీ, షాద్ నగర్‌ దగ్గర రూ.25 లక్షలు విలువ చేసే సువర్ణ కుటీర్ ల్యాండ్ బహుమతులుగా దక్కనున్నాయి.

Read Also: ఆ ‘కిక్’ నాకు ‘అఖండ’ సినిమాతో వచ్చింది: అల్లు అర్జున్

ఇక హౌస్ నుంచి బయటకు వెళ్తున్న కాజల్‌కు నాగార్జున ఓ టాస్క్ ఇచ్చాడు. హౌస్‌లో ఉన్న ఐదుగురు సభ్యులకు ఏం ట్యాగ్స్ ఇస్తావో చెప్పమని అడిగాడు. దీంతో సన్నీకి 5 టైమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మానస్‌కు 5 టైమ్స్ ఫ్రెండ్‌షిప్, సిరికి 5 టైమ్స్ ఎమోషన్, శ్రీరామచంద్రకు 5 టైమ్స్ యాక్షన్, షణ్ముఖ్‌కు 5 టైమ్స్ డ్రామా అనే ట్యాగ్స్‌ను కాజల్ ఇచ్చింది. అంతకుముందు పాత హౌస్‌మేట్స్.. ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవారిని వీడియో ద్వారా కొన్ని ప్రశ్నలు అడిగారు. ముందుగా జెస్సీ తన స్నేహితుడు షణ్ముఖ్‌కు ప్రశ్న సంధించాడు. ‘షన్ను చాలా సీరియస్ గా అడుగుతున్నాను. నీకు సిరికి ఎలాంటి బాండింగ్ ఉందో నాకు తెలుసు. వేరే జనాలు ఏం అనుకుంటున్నారో.. నువ్ ఎప్పుడైనా ఆలోచించావా..?’ అని ప్రశ్నించాడు. దానికి షణ్ముఖ్.. ‘సిరితో నా రిలేషన్ ఏంటో నీకు తెలుసు.. కానీ అది బయటకు ఎలా వెళ్తుందో తెలియదు. ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చిన తరువాతనే తెలిసింది.. సిరి నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. తనకి ఎప్పటికీ సపోర్ట్ సిస్టంలా ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

సన్నీకి యానీ మాస్టర్ తన ప్రశ్నను సంధించింది. తాను హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా తనను బ్యాక్ బిచ్ చేస్తున్నావంటూ సన్నీని ప్రశ్నించింది. దీనికి సన్నీ స్పందిస్తూ.. తానెప్పుడూ అలా చేయలేదని.. తన ఒపీనియన్ మాత్రమే చెప్పానని స్పష్టం చేశాడు. యానీ మాస్టర్ చెప్పేవన్నీ చెబుతుంది కానీ దానిపై స్టాండ్ తీసుకోరని.. ఆమె ఎప్పటికీ తనకు మంచి ఫ్రెండ్ అని సన్నీ చెప్పాడు. మానస్‌ను ప్రియాంక ప్రశ్న వేసింది. ‘మానస్.. నేను నిన్నొకటి అడగాలని అనుకుంటున్నాను. ఇన్ని హౌస్‌లో నువ్వు నన్ను భరించావా..? లేక నటించావా..? ఎందుకంటే బయటకొచ్చాక కొన్ని ఎపిసోడ్స్ చూశాను’ అని ప్రశ్నించింది. దీనికి మానస్ స్పందిస్తూ… ‘భరించాను.. ఎప్పుడూ నటించలేదు. జెన్యూన్ ఎమోషన్స్ డిస్ ప్లే చేశాను’ అంటూ బదులిచ్చాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big boss 5
  • big boss final week
  • Bigg Boss Telugu Season 5
  • LATEST TELUGU NEWS
  • top 5 contistants

తాజావార్తలు

  • Irumudi: రవితేజ ‘ఇరుముడి’లో సీనియర్ హీరోయిన్ ..

  • Jananayagan Leak : జననాయగన్ లీక్.. విజయ్ కు ఎంతో మేలుచేసినట్టే

  • Newly Weds Death: పెళ్లి జరిగిన తెల్లారే విషాదం.. వధూవరులతో సహా నలుగురు మృతి

  • Telangana Inter Results 2026: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి…

  • Sameera Reddy:ఎయిర్‌పోర్ట్ లుక్ కోసం లక్షల ఖర్చు.. హీరోయిన్ల పరిస్థితిపై సమీరా రెడ్డి ఆవేదన!

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions