NTV Telugu Site icon

Bigg Boss 6: ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ అవుట్..!!

Bigg Boss Raj

Bigg Boss Raj

Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 12వ వారం వీకెండ్‌కు చేరుకుంది. ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు ఉన్నారు. కెప్టెన్ రేవంత్‌, కీర్తిని మినహాయిస్తే మిగతా వాళ్లంతా నామినేషన్ ప్రక్రియలో ఉన్నారు. రేవంత్ లేకపోవడంతో ఇనయాకు ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో తరువాతి స్థానాల్లో శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో మాత్రం రాజ్, ఫైమా ఉన్నారు. అయితే ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటంతో ఆమె సేవ్ అయ్యిందని.. దీంతో రాజ్ ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు గాసిప్ రాయుళ్లు ప్రచారం చేస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో రాజ్ కాంట్రవర్సీలకు దూరంగా ఉండేవాడు. హౌస్‌లో అతడితో ఫైమా, ఇనయా ఎక్కువ క్లోజ్‌గా ఉండేవాళ్లు. చలాకీ చంటి ఉన్న సమయంలో రాజ్‌పై ఎన్నో జోకులు వేసేవాడు.

Read Also: Heroines: ఐకానిక్ పాత్రలను వదులుకున్న హీరోయిన్లు.. చేసి ఉంటేనా

అటు గత రెండు వారాల నుంచి రాజ్ నామినేషన్లలో లేడు. ఈసారి అందరూ కావాలని అతడిని నామినేట్ చేశారు. దీంతో అతడు నామినేషన్స్‌లోకి రావాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే మిగతా వాళ్లతో పోలిస్తే ఈ వారం అతడికే తక్కువ ఓట్లు పడినట్లు కనిపిస్తోంది. మోడల్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన రాజ్ ఆరంభంలో సైలెంట్‌గా ఉండేవాడు. ఆ తర్వాత తన ఆటతీరు, మాటతీరు మార్చుకున్నాడు. మాట్లాడేది తక్కువే అయినా సరే కరెక్ట్ పాయింట్స్ మాట్లాడతాడని హౌస్ మేట్లతో పాటు హోస్ట్ నాగార్జున కూడా చాలాసార్లు మెచ్చుకున్నాడు. గతవారం కూడా చెక్ అమౌంట్ టాస్కులో తన తెలివి ఉపయోగించి నామినేషన్ నుంచి తప్పించుకున్నాడు.

Read Also: Bhanu Prakash Reddy: ఏపీలో చర్చిల నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలి

Show comments